DreamPirates > Lyrics > గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా Lyrics

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-07-08 09:43:31

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Priyadarshan
Singer : S.P.Balasubramanyam, M. G. Sreekumar, Anuradha
Composer : M. M. Keeravani
Publish Date : 2023-07-08 09:43:31

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా Lyrics

Song Lyrics :

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిల పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారాసుడ్ని చూసినప్పుడే వరాల వాంచలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిల పువ్వులే పుట్టలేదా

ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల వేగానా
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళల్లోనా ఎల్లకిల పడ్డట్టున్న అల్లో మల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే సూరిడమ్మా ఇంటి దీపాలవ్వాలంట దిక్కుల్లో
ఎవరికివారే ఏ… యమునకు మీరే ఏ….
రేవు నీరు నావదంట నావ తోడు రేవుదంట పంచుకుంటే
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిల పువ్వులే పుట్టలేదా

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే
బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బెల్లడే పొద్దుల్లో
పరవశమేదో.. ఓ.. పరిమళమాయే ఏ..
పువ్వు నవ్వే దివ్వె నవ్వే
జువ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గణ గణ గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిల కిల పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారాసుడ్ని చూసినప్పుడే వరాల వాంచలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై

Tag : lyrics

Relative Posts