DreamPirates > Lyrics > ఓ సీతా హే రామ లిరిక్స్ -సీతా రామం | ఎస్ పి బి చరణ్, రమ్య బెహరా Lyrics

ఓ సీతా హే రామ లిరిక్స్ -సీతా రామం | ఎస్ పి బి చరణ్, రమ్య బెహరా Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-11 00:00:00

ఓ సీతా హే రామ లిరిక్స్ -సీతా రామం | ఎస్ పి బి చరణ్, రమ్య బెహరా Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : అనంత శ్రీరామ్
Singer : ఎస్ పి బి చరణ్, రమ్య బెహరా
Composer : విశాల్ చంద్రశేఖర్
Publish Date : 2022-11-11 00:00:00

ఓ సీతా హే రామ లిరిక్స్ -సీతా రామం | ఎస్ పి బి చరణ్, రమ్య బెహరా Lyrics


Song Lyrics :

తెలుగులో ఓ సీతా హే రామ పాట సాహిత్యం

పల్లవి :
పురుషుడు :
ఓ సీతా వదలనిక తోడౌతా
రోజంతా వెలుగులిడు నీడౌతా
దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపెనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా

కనులలో మెరుపులా తారాడే
కలని నేనౌతా

స్త్రీ :
హే రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా
రేపేం జరుగునో రాయగలమా
రాసే కలములా మారుమా
జంటై జన్మనే గీయగలమా
గీసే కుంచెనే చూపుమా

మెరుపులో ఉరుముల దాగుండే
నిజము చూడమ్మా

పురుషుడు :
ఓ సీతా వదలనిక తోడౌతా

స్త్రీ :
హే రామా ఒకరికొకరౌతామా

చరణం 1:
పురుషుడు :
నేరుగా పైకి తెలుపని
పలుకులన్నీ నీ చూపులై
నేలపై వాలుతున్నవి
అడుగు అడుగున పువ్వులై

స్త్రీ :
ఓ వైపేమో ఓపలేని మైకం
లాగుతొంది మరోవైపు లోకం

ఏమి తోచని సమయమో
ఏది తేల్చని హృదయమో
ఏమో బిడియమో నియమమో
నన్నపే గొలుసు పేరేమో

చరణం 2:
స్త్రీ :
నిదుర లేపడుగు ఒక్క
నీ పేరే కలవరిస్తానులే

పురుషుడు :
నిండు నూరేళ్లు కొలువలో తెలిసి
జాగు చేస్తావులే

స్త్రీ :
ఎపుడు లేదే ఏదో వింత బాధే
బృందగానం :
వంత పాడే క్షణం ఎదురాయే

స్త్రీ :
కలిసొస్తావు ఓ కాలమా
కలలు కునుకులా కలుపుమా
కొలిచే మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మా

స్త్రీ :
హే రామా ఒకరికొకరౌతామా
కాలంతో కలిసి అడుగేస్తామా

పురుషుడు :
దారై నడిపేనే చేతి గీత
చేయి విడువక సాగుతా
తీరం తెలిపేనే నుదుటి రాత
నుదుట తిలకమై వాలుతా

కనులలో మెరుపులా తారాడే
కలని నేనౌతా

Tag : lyrics

Relative Posts