DreamPirates > Lyrics > మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో Manchu Kurise Full Song With Telugu Lyrics

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో Manchu Kurise Full Song With Telugu Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-07-31 06:36:42

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో Manchu Kurise Full Song With Telugu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Acharya Atreya
Singer : S.P.Balasubramanyam, S.Janaki
Composer : Ilayaraja
Publish Date : 2023-07-31 06:36:42

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో Manchu Kurise Full Song With Telugu  Lyrics


Song Lyrics :

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో


నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
నీవు పిలిచే పిలుపులో జాలువారే ప్రేమలో
జలకమాడి పులకరించే సంబరంలో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
జలదరించే మేనిలో తొలకరించే మెరుపులో
ఎందుకా ఒంపులో ఏమిటా సొంపులో


మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో


మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మొలకసిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో
మన్మధునితో జన్మ వైరం సాగినపుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
ఆరిపోని తాపము అంతు చూసేదెప్పుడో
మంచులే వెచ్చని చిచ్చులైనప్పుడో


మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో
మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో
మంచు కురిసే వేళలో

Tag : lyrics

Watch Youtube Video

మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో Manchu Kurise Full Song With Telugu  Lyrics

Relative Posts