DreamPirates > Lyrics > దైవ ప్రణాళిక || Adviteeyuda || Hosanna 2023 New Song No: 7 || Pas.John Wesly Lyrics

దైవ ప్రణాళిక || Adviteeyuda || Hosanna 2023 New Song No: 7 || Pas.John Wesly Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-03-31 12:58:43

దైవ ప్రణాళిక || Adviteeyuda || Hosanna 2023 New Song No: 7 || Pas.John Wesly Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pastor Ramesh
Singer : Pas.John Wesley
Composer : Pranam Kamalakhar
Publish Date : 2023-03-31 12:58:43

దైవ ప్రణాళిక  || Adviteeyuda || Hosanna 2023 New Song No: 7 || Pas.John Wesly Lyrics


Song Lyrics :

నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నా ప్రార్థన విజ్ఞాపనా నిత్య మహిమలో నిలవాలని
అక్షయుడా నీ కలువరి త్యాగం
అంకితభావం కలుగ జేసేను
ఆశల వాకిలి తెరచినావు -
అనురాగ వర్షం కురిపించినావు
*నా హృదయములో ఉప్పొంగేనే -
కృతజ్ఞతా సంద్రమే
నీ సన్నిధిలో స్తుతి పాడనా -
నా హృదయ విద్వాంసుడా*

1.యదార్ధ వంతుల యెడల -
నీవుయెడబాయాక కృప చూపి
గాఢాందకారము కమ్ముకొనగా
వెలుగు రేఖవై ఉదయించినావు
నన్ను నీవు నడిపించి నావు -
ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన -
సజీవుడవు నీవెనయ్యా
|| నా హృదయములో ||

2.నాలో ఉన్నది విశ్వాస వరము -
తోడై యున్నది వాగ్దాన బలము
ధైర్య పరచి నడుపుచున్నది
విజయసిఖరపు దిశగా
ఆర్పజాలని నీ ప్రేమతో -
ఆత్మ దీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము
నాకు నేర్పిన సాత్వీకుడా
|| నా హృదయములో ||

3.స్వఛ్చమైనది నీవాక్యం - వన్నెతరగని ఉపదేశం
మహిమగలిగిన సంఘముగా నను
నిలుపునే నీ యెదుట
సిగ్గు పరచదు ననెన్నడూ నీలో నాకున్న నిరీక్షణ
వేచియున్నాను నీ కోసమే
సిద్ధపరచుము సంపూర్ణుడా
|| నా హృదయములో ||

Tag : lyrics

Relative Posts