Sittapata Sinukulaku Song Lyrics | Latest Telangana | Folk Songs Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Sekarana:Prabha (Amm |
Singer : | Prabha , Gajwel Venu |
Composer : | Gajwel Venu |
Publish Date : | 2022-09-12 00:00:00 |
సిట్టాపటా సినుకులకు… ఏడ తిన్నవురో రాతిరి
నువ్వు ఏడ పన్నవురో రాతిరి
కోంటోళ్ళ ఇంటికాడ కోలాటమాడితే
ఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి
సిట్టాపటా సినుకులకు… ఏడ తిన్నవురో రాతిరి
నువ్వు ఏడ పన్నవురో రాతిరి
కోంటోళ్ళ ఇంటికాడ కోలాటమాడితే
ఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి
కలమాంబాయే కరెంటు పాయె
ఏడ తిన్నవురో రాతిరి… నువ్వు ఏడ పన్నవురో రాతిరి
కాపోల్ల ఇంటి కాడ కబడ్డీ ఆడితే
ఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి
సిట్టాపటా సినుకులకు… ఏడ తిన్నవురో రాతిరి
నువ్వు ఏడ పన్నవురో రాతిరి
ఆ కాపోల్ల ఇంటి కాడ కబడ్డీ ఆడితే
ఆడవోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి
కండ్లన్ని కాయలు కాయంగా సూస్థిరో
ఏడ తిన్నావురో రాతిరి… నువ్వు ఏడ పన్నవురో రాతిరి
గౌండ్లోల్ల ఇంటికాడ గోళీలు ఆడితే
ఆడ వోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి
సిట్టాపటా సినుకులకు… ఏడ తిన్నవురో రాతిరి
నువ్వు ఏడ పన్నవురో రాతిరి
గా గౌండ్లోల్లింటికాడ గోళీలు ఆడితే
ఆడ వోయిన్నే రాతిరి… నేను సూడవోయిన్నే రాతిరి
నమ్మివచ్చిన దాన్నిరో నేను
ఆగం చెయ్యకో బావయ్య
నన్నాగం చెయ్యకో బావయ్యో
నా మీద నీకు ఉన్న ప్రేమానుబంధం
నేను ఎరుగక పోతిని… ఛీ బుద్ది తక్కువోన్నైతిని
కడదాక నీతోనే కలిసుంట బావయ్య
వదిలి పెట్టకో బావయ్య… నన్ను ఒంటరి చేయకు బావయ్య
నమ్ముకున్న నిన్ను ఆగం చెయ్యను
ప్రాణం ఇస్తనే జానకి… నీ మీద పమాణమే జానకి
వదిలి పెట్టకో బావయ్య
నన్ను ఒంటరి చేయకు బావయ్య
ఆ, ఆగం చేయను జానకి
నీ మీద పమాణమే జానకి
నన్ను వదిలి పెట్టకో బావయ్య
నువ్వు ఒంటరి చెయ్యకు బావయ్య
నిన్ను ఆగం చెయ్యను జానకి
నీ మీద పమాణమే జానకి