Aalayana Harathilo Song | Suswagatham Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Chintapalli Ramana |
Singer : | S P Balasubrahmanyam |
Composer : | Thaman S. |
Publish Date : | 2022-11-16 00:00:00 |
Aalayana harathilo aakhari chiti mantalalo
Renditilo nijaanikunnadi okate agnigunam
Prema ane padana unnadi arani agnikanam
Deepanni choopedutundo tapana balipedutundo
Amrutamo halahalamo emo prema gunam
Ye kshanana yelaaga maaruno preminche hrudaym
Aalayaana haaratilo aakhari chiti mantalalo
Renditilo nijaanikunnadi okate agnigunam
Yendamaavilo enta vetikinaa neeti chemma dorikenaa
Gundae bavilo unna asha tadi aaviri avutunna
Prapanchanni maripinchela mantrinche o prema
Yela ninnu kanipettaalo aachooki ivvamma
Nee jaada teliyani pranam chestondi gagana prayaanam
Yadhara undi nadireyannadi ee sandhya samayam
Ye kshanana yelaaga maaruno preminche hrudaym
Aalayaana haaratilo aakhari chiti mantalalo
Renditilo nijaanikunnadi okate agnigunam
Sooryabinbame astaminchanide melukoni kala kosam
Kallu moosukoni kalavarinchene kantipapa papam
Aayuvichhi penchina bandham mounamlo masi ayina
Reyichatu swapnam kosam aalaapana aagena
Pondedhi yedemaina poyindi tirigochhena
Kantipapa kala adigindani nidhurinchenu nayanam
Ye kshanana yelaaga maaruno preminche hrudaym
Aalayaana haaratilo aakhari chiti mantalalo
Renditilo nijaanikunnadi okate agnigunam
Prema ane padana unnadi arani agnikanam
Deepanni choopedutundo tapana balipedutundo
Amrutamo halahalamo emo prema gunam
Ye kshanana yelaaga maaruno preminche hrudaym
ఆలయాన హారతిలో.. ఆఖరి చితి మంటలలో..
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ఆలయాన హారతిలో.. ఆఖరి చితి మంటలలో..
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో.. తాపాన బలిపెడుతుందో..
అమృతమో.. హాలాహలమో.. ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో.. ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో.. ఆఖరి చితి మంటలలో..
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ఎండమావిలో ఎంత వెతికినా.. నీటి చెమ్మ దొరికేనా..
గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా..
ప్రపంచాన్ని మరిపించేలా.. మంత్రించే ఓ ప్రేమా..
ఎలా నిన్ను కనిపెట్టాలో.. ఆచూకి ఇవ్వమ్మా..
నీ జాడ తెలియని ప్రాణం, చేస్తోంది గగన ప్రయాణం
ఎదర ఉంది నడిరేయన్నది, ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునో.. ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో.. ఆఖరి చితి మంటలలో..
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
సూర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకొని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా..
రేయిచాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా..
పొందేది ఏదేమైనా.. పోయింది తిరిగొచ్చేనా..
కంటిపాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునో.. ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో.. ఆఖరి చితి మంటలలో..
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం
దీపాన్ని చూపెడుతుందో.. తాపాన బలిపెడుతుందో..
అమృతమో.. హాలాహలమో.. ఏమో.. ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునో.. ప్రేమించే హృదయం