DreamPirates > Lyrics > Antha naa meluke Lyrics

Antha naa meluke Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-09 12:37:56

Antha naa meluke Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : no
Singer : No
Composer : no
Publish Date : 2023-09-09 12:37:56

Antha naa meluke Lyrics


Song Lyrics :

నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను 1. కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా(2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ(2) మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ(2) ||అంతా|| 2. ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా(2) యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను(2) ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక(2) ||అంతా|| 3. అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున(2) నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు(2) నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు(2) ||అంతా||

4. ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును(2)
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా(2)
పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్(2) ||అంతా||

5. చదువులే రాకున్నా – ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా(2)
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు(2)
నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు(2) ||అంతా||

6. సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును(2)
యేసుని సారూప్యము – నేను పొందాలని(2)
అనుమతించిన ఈ – విలువైన సిలువకై(2) ||అంతా||

7. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును(2)
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే(2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే(2) ||అంతా||

Tag : lyrics

Relative Posts