Bulet bandi Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Laxman |
Singer : | Mohana Bhogaraju |
Composer : | SK Baji |
Publish Date : | 2023-09-19 13:10:10 |
ఏ పట్టు చీరనే గట్టుకున్న
గట్టుకునోల్లో… గట్టుకున్నా…
టిక్కి బొట్టే వెట్టుకున్న
వెట్టుకునోల్లో… వెట్టుకున్న…
నడుముకు వడ్డణ చుట్టుకున్న
జుట్టుకునోల్లో… జుట్టుకున్న…
దిష్టి చుక్కనే దిద్దుకున్న
దిద్దుకునోల్లో… దిద్దుకున్న…
పెళ్లి కూతురు ముస్తాబురో. . .
నువ్వు యడంగా వస్తావురో. . .
చెయ్యి నీ చేతికిస్తానురో
అడుగు నీ అడుగులో ఎస్తానురో…
నేను మెచ్చి నన్నే మెచ్చే టోడ
ఇట్టే వస్తా రా నీ వెంట
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా
డుగ్గు డగ్గు డగ్గు డుగ్గు అని
అందాల దునియానే సూపిత్తాపా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని || నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా ||
చెరువు కట్టపోంటి చేమంతి వనం
బంతివనం చేమంతివనం
చేమంతులు తెంపి దండా అల్లుకున్న
అల్లుకునోల్లో… అల్లుకున్న…
మా ఊరు వాగు అంచున మల్లేవనం
మల్లేవనముల్లో… మల్లేవనం
మా మల్లేలు తెంపి ఒళ్లో
నింపుకున్న నింపుకునోల్లో… నింపుకున్న….
నువ్వు నన్నెలుకున్నావురో
దండ మెల్లోన ఏస్తానురో
నేను నీ యేలు పట్టుకుని
మల్లే జెల్లోనా పెడతానురో…
మంచి మర్యాదలు తెలిసిన దాన్ని
మట్టి మనుషుల్లోన పెరిగినా దాన్ని || నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా ||
నే అవ్వ సాటు ఆడపిల్లనయ్యో
పిల్లనయ్యో…. ఆడపిల్లనయ్యో….
మా నాన్న గుండెల్లోనా ప్రేమనయ్యో
ప్రేమనయ్యో…. నేను ప్రేమనయ్యో…
ఏడు గడపలల్ల ఒక్కదాన్నిరయ్యో
దాన్ని రయ్యో… ఒక్కదాన్నిరయ్యో…
మా అన్నదమ్ములకు ప్రాణమయ్యో…
ప్రాణమయ్యో… నేను ప్రాణమయ్యో…
పండు ఎన్నల్లో… ఎత్తుకుని
ఎన్నముద్దలు పెట్టుకొని
ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా…
నన్ను గరాలు చేసుకొని
చేతుల్లో పెంచారు… పువ్వల్లేనన్ను
నీ చేతికి ఇస్తారా.. నన్నేరా నేనూ || నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా ||
నా కుడికాలు నీ ఇంట్లో వెట్టినంకా
వెట్టినంకుల్లో… వెట్టినంకా…
సిరి సంపద సంబురం గల్గునింకా
గల్గునింకుల్లో… గల్గునింకా….
నిన్ను గన్నల్లో కన్నోళ్లు
అల్లుకుంటా అల్లుకుంటుల్లో… అల్లుకుంటా
నీ కష్టల్లో భాగాలు పంచుకుంటా..
పంచుకుంటుల్లో… పంచుకుంటా
చుక్క పొద్దుకే నిద్ర లేసి
చుక్కల ముగ్గుల అకిట్లా యేసి
చుక్కలే నిన్నునన్ను చూసి…
మురిసిపోయేలా నీతో కలిసి
నా ఏడుజన్మలు నీకిచ్చుకుంటా
నీతోడులో నన్ను నే మెచ్చుకుంటా ||నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా ||