Chellame Song Lyrics | Chill Bro | Ritesh G Rao | Bhaskara Bhatla Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Bhaskara Bhatla |
Singer : | Ritesh G Rao |
Composer : | Shekar Chandra |
Publish Date : | 2022-09-12 00:00:00 |
తొలిసారి నిన్ను చేతుల్లో మోసి
ముడివేసుకున్నాను తీపి బంధము
చెల్లెమ్మా నువ్వు పుట్టాకే
అన్నలా నేను పుట్టనే
వంద జన్మలూ వేయి జన్మలూ
తోడుగా నీకు ఉంటానే
చెల్లెమ్మా నువ్వు వచ్చాకే
గుండెకే సందడొచ్చిందే
దారి చూపే వేలి చివరై
నిన్ను నడిపిస్తూ ఉంటానే
నే ఎపుడు కలలే కనని
ఓ వరమై ఎదురే నిలిచావే
జాబిల్లిని నీకోసం తెద్దామంటే
నువ్వే ఒక జాబిలిలా ఉన్నావు తెలుసా
నీకోసం నా ఒడిని ఉయ్యాల చేస్తాను
నిదరొచ్చి బజ్జుంటే జోలాలి అవుతాను
నీ బుజ్జి పిడికిట్లో దాచేసుకుంటాను
నా పంచ ప్రాణాలనీ
చెల్లెమ్మా నువ్వు పుట్టాకే
అన్నలా నేను పుట్టనే
వంద జన్మలూ వేయి జన్మలూ
తోడుగా నీకు ఉంటానే
చెల్లెమ్మా నువ్వు వచ్చాకే
గుండెకే సందడొచ్చిందే
దారి చూపే వేలి చివరై
నిన్ను నడిపిస్తూ ఉంటానే
నీ చిన్ని పాదం అడుగేయగానే
ఉప్పొంగిపోయింది నా ప్రాణమూ
ఆ నదికే పరుగే వస్తే
నీలాగే ఉంటుందే బహుశా
నీ అల్లరి చూసిందో సీతాకోక
నీ స్నేహం కావాలని రాదా నీ వెనక
కోతికొమ్మచ్చాట ఆడేసుకుందాము
ఇసుకలోన గూళ్ళు కట్టేసుకుందాము
తిట్టేసుకుందాము కొట్టేసుకుందాము
కలిసిపోదాము
చెల్లెమ్మా నువ్వు పుట్టాకే
అన్నలా నేను పుట్టనే
వంద జన్మలూ వేయి జన్మలూ
తోడుగా నీకు ఉంటానే
చెల్లెమ్మా నువ్వు వచ్చాకే
గుండెకే సందడొచ్చిందే
దారి చూపే వేలి చివరై
నిన్ను నడిపిస్తూ ఉంటానే