DreamPirates > Lyrics > Chinnanati Aatalu song lyrics - Mic Tv | Yashpal Lyrics

Chinnanati Aatalu song lyrics - Mic Tv | Yashpal Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-22 00:00:00

Chinnanati Aatalu song lyrics - Mic Tv | Yashpal Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Yashpal
Singer : Rohini, Hanmanth yadav
Composer : Charan Arjun
Publish Date : 2022-10-22 00:00:00

Chinnanati Aatalu song lyrics - Mic Tv | Yashpal Lyrics


Song Lyrics :

చిన్ననాటి ఆటలో చిత్తరాల ఆటలో
వీరి వీరి గుమ్మడి పండు వీధులల్ల ఆటలు
వీని పేరు ఏందని చెప్పి పాడుకున్న పాటలు

రింగురింగు బిల్లా అంటూ ఆడుకున్న ఆటలు
తీరూ తీరుగా ఊరేటి సెలయేటి ఊటలు
బడికి సెలవులొచ్చాయంటే గల్లీ మొత్తం గంతులే
చిన్నచిన్నా చింతాలల్లా చిన్నానాటి ఆటలు
గున్నాగున్నా మామిళ్లల ఎన్నోఎన్నో పాటలు
గుబ్బాచెట్లా కింద మనం ఏరుకున్న కాయలు
ఊడల మర్రికాడ మనం ఊగిన ఉయ్యాలలు

వీరి వీరి గుమ్మడి పండు వీధులల్ల ఆటలు
వీని పేరు ఏందని చెప్పి పాడుకున్న పాటలు

శీనుగాడు శిరీషా మల్లిగాడి లొల్లి
మన షేకు బేగం కొట్టు కాడ కొన్న శనగపల్లి
బొట్టు బిల్లా రిబ్బన్లూ గాజులు తెచ్చుకున్నం
మన అమ్మమ్మా సంచిలోన పైసలెత్తుకెళ్లి..

ఇంటి ముందల దోస్తులొచ్చి చాటుగా విలిసేది
సైగలతోనే వస్తని చెప్పి వాళ్లను తోలేది

మామయ్య ఇంటికి పోతనని మాయబుచ్చేది
సందు దొరికితే చాలు చలో సర్రున జారేది

నల్లా నల్లా బండాలెక్కి జారుడు బండలు జారినం
తెల్లా తెల్లా కొంగలు చూసి పాలు వోయని అడిగినం
ఊరాపిచ్చుక వట్టాలని చాపకు దారం కట్టినం
వాగు ఒడ్డున ఇసుక తిన్నెల పిట్టల గూడే కట్టినం

కాళ్లా గజ్జా కంకానమ్మా కలిసీ మెలిసీ పాడినం
వేగుచుక్కా వెలగాపండు వెన్నెల మడుగుల ఆడినం

అగడు వట్టినట్టే ముద్దలు గబాగబా మింగేది
ఆట మీద వడితే ఇల్లు యాదే మరిచేది
హద్దు పద్దు లేదని అమ్మ ఒకటే తిట్టేది
మా ఇంటి చుట్టూ గెదిమి పొరకవట్టీ కొట్టేది

అమ్మ ఎంత గొట్టినా దెబ్బలు తగలకపోయేది
ఆడుకున్నా ఆనందంలో అంతా మరిచేది

తల్లి కోడి చూడకుండా పిల్లలు పట్టేది
ఆ తల్లి ఎంబడిబడితే వదిలి ఇంట్లోకురికేది

ఊరి చెరువుల పోరలమంతా బుడుబుంగోలె మునిగేది
అడుగున అల్లి పూలను తెచ్చి దండలు మేము అల్లేది
ఎండా కొడతా ఉంటే మాకు కొమ్మా గొడుగూ వట్టేది
తాటి మట్టలు చెప్పులు చేసి రెండు కాళ్లకు కట్టేది

మళ్లీ మళ్లీ రాని ఈడున మల్లెపూలై నవ్వినం
బరువు బాధ్యత ఏది లేక బంగారంలా బతికినం
చిన్ననాటి ఆటలో చిత్తరాల ఆటలో
చిన్ననాటి ఆటలో చిత్తరాల ఆటలో
ఎన్నడు ఇంకిపోని గుండెలోని గుర్తులు

Tag : lyrics

Relative Posts