DreamPirates > Lyrics > chinni ma bathukamma lyrics - Telu VIjaya, Kandikuri VIjaya Babu| Bathukamma Lyrics

chinni ma bathukamma lyrics - Telu VIjaya, Kandikuri VIjaya Babu| Bathukamma Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-23 00:00:00

chinni ma bathukamma lyrics - Telu VIjaya, Kandikuri VIjaya Babu| Bathukamma Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : chinni ma bathukamma
Singer : Telu VIjaya, Kandikuri VIjaya Babu
Composer : chinni ma bathukamma
Publish Date : 2022-09-23 00:00:00

chinni ma bathukamma lyrics - Telu VIjaya, Kandikuri VIjaya Babu| Bathukamma  Lyrics


Song Lyrics :

చిన్నీ మా బతుకమ్మ చిన్నారక్క బతుకమ్మ
దాదీ మా బతుకమ్మ దాగెర మొగ్గల బతుకమ్మ

తంగెడు పువ్వులు తళతళ మెరిసే వాడ వాడంతా
ఓ పూల వనమాయె
ప్రతి ఊరి చేరివేవో ఓ పూల తోటాయే
గూనుగు పువ్వుల మిరమిర మెరిసే
వాడ వాడంతా ఓ పూల వనమాయె
ప్రతి ఊరి చేరివేవో ఓ పూల తోటాయే
ఆఆఆఆఆఆ
Fపచ్చ పచ్చని పల్లె పచ్చ..ని పల్లె
మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఊడ్చి
ముగ్గులు పెట్టింది
అందాల బొబ్బెమ్మ వాకిట్లో పెట్టి
చెయ్యెత్తి మొక్కింది
కాపాడమంటూ గౌరమ్మనడిగింది

M హే ఆడబిడ్డలు ఇంటింట నిండే
అమ్మ నాన్న గుండెంత పొంగే
సత్తి పిండి నకినాలు చూస్తే
నోటినిండా ఊరిళ్లు ఊరే
పొద్దు పొద్దున్నే తమ్ముళ్లు లేచి
పూలకోసం బైలెల్లి ఉరికే
చాప పరిచీ వాకిళ్లలోనా..
చెల్లెలంతా బతుకమ్మ పేర్చే హే..ఏ.......

Fపచ్చ పచ్చని పల్లె పచ్చ..ని పల్లె
మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఊడ్చి
ముగ్గులు పెట్టింది
అందాల బొబ్బెమ్మ వాకిట్లో పెట్టి
చెయ్యెత్తి మొక్కింది
కాపాడమంటూ గౌరమ్మనడిగింది

Mహే ఏలా ఏలా.. ఏలెలా ఏలా ఏలా...

ఏలెలే ఏలే ఏలా..ఏలెలా ఏలేలా..ఏలా
హే ఏలా ఏలా.. ఏలెలా ఏలా ఏలా...
ఏలెలే ఏలే ఏలా..ఏలెలా ఏలేలా..ఏలా

Fఅగ్గో సింటాలు బూసే సింతలు గాసే
ఓ లాలి గుమ్మడి ఓ లాలీ ముద్దుల గుమ్మడి
ఓ లాలీ ముద్దుల గుమ్మడి
భలే చినుకూ కురిసే పుడమి మురిసే
ఓ లాలి గుమ్మడి ఓ లాలీ ముద్దుల గుమ్మడి
ఓ లాలీ ముద్దుల గుమ్మడి
మట్టి వాసన మనసన్ను తాకే
పంటా పొలము పచ్చగ నవ్వే
పక్షీ ఎగిరి పరుగూ తీసే
పశువు..లన్నీ సింధులు వేసే

Mహే నింగి నెల ఊరు వాడ..
పరవశించి పండుగ జరిపే....

Fపచ్చ పచ్చని పల్లె పచ్చ..ని పల్లె

మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఊడ్చి
ముగ్గులు పెట్టింది
అందాల బొబ్బెమ్మ వాకిట్లో పెట్టి
చెయ్యెత్తి మొక్కింది
కాపాడమంటూ గౌరమ్మనడిగింది

FMహే బతు.. కమ్మ నెత్తికెత్తి
ప్రతి వాడ వాడ కదులుతుంటే
చూడ రెండు కళ్ళు చాలవసలే పూల నదులే
ఊరి చెరువు కట్ట కాడ
మన అక్క చెల్లెళ్లంత చేరి
ఆడిపాడుతుంటె మది మురిసీ కళ్ళు తడిసె

Mహే....ఏ...ఏ...ఏ...ఏ...పాత ఇనుప సందుగలో

ఉన్న కొత్త బట్టలే.... ఒంటి పైకి ఒచ్చేసి

FMగల్లీ గల్లీ ఊరేగే....

హా.. ఆ...ఆ..ఆ.ఆ.ఆఆ
హా.. ఆ...ఆ..ఆ.ఆ.ఆఆ

Fహే..పున్నా మా పున్నా మా నిండు పున్నామా
సిరి మల్లెలో మా రాగి మల్లెలు
సిరి మల్లెలు మా రాగి మల్లెలు
ఇకా రంగు రంగు పూలుదెచ్చి రాసుల్లు పోసే
సిరి మల్లెలో మా ఎండు మల్లెలు
సిరి మల్లెలో మా ఎండు మల్లెలు
అగో తీరొక్క పూలతోటి అందంగా వేర్చే
సిరి మల్లెలో మా రాగి మల్లెలు
సిరి మల్లెలు మా రాగి మల్లెలు
మనసు బతుకునిచ్చు బతుకమ్మను
భక్తితోటి గొలిసె
సిరి మల్లెలో మా పండు మల్లెలు
సిరి మల్లెలో మా పండు మల్లెలు

M హేఏ..పూలన్నీ పులకించే మట్టి మనషులాట

పుడమినంత ఆడించె చమట చుక్క పాట
రాలే కన్నీరు నవ్విందీ పూటే
అక్కా అందుకుంది ఉయ్యాల పాటే
కష్టం చేసే౼చెయ్యి కావులాటలాడే...
బడికీ పోయె చెల్లి బతుకమ్మనెత్తె
పడి౼లేచే పాపలు... పండు౼ముసలి తాతలూ...
చేసే సంబురాలు ఈ రోజే......

Fమా భూమాత గారాల అందాల తనయీ

నాగ మల్లెలు మా తీగ మల్లెలు
సిరి మల్లెలో మా రాగి మల్లెలు
సిరి మల్లెలో మా రాగి మల్లెలు
మమ్ము కరుణించి కాపాడు బతుకమ్మ తల్లి
నాగ మల్లెలు మా తీగ మల్లెలు

Fసిరి మల్లెలో మా రాగి మల్లెలు(Mఎ ఏఏఏ హే)
సిరి మల్లెలో మా పండు మల్లెలు(Mఎ ఏఏఏ హే)
సిరి మల్లెలో మా పండు మల్లెలు(Mఎ ఏఏఏ హే)
సిరి మల్లెలో మా పండు మల్లెలు(Mఎ ఏఏఏ హే)
ఎ ఏఏఏ హే..

Tag : lyrics

Relative Posts