Darling - Inka Edho Video | Prabhas | G.V. Prakash Kumar Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Anantha Sriram |
Singer : | suraj & Prashanthini |
Composer : | G.V. Prakash Kumar |
Publish Date : | 2023-01-06 00:00:00 |
ఇంకా ఎదో... ఇంకా ఎదో
ఇదై పోతావె ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు
ఏదై చేరాలి ఈరోజే చెలి చెంతకు
కలలో ఈ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేది నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు
(పపపద రారా పరుగున రారా గురువా గురువా
ఇక భయపడకుండా బయటకి తీరా చొరవా చొరవా)
ఇంకా ఎదో... ఇంకా ఎదో
ఇదై పోతావ్ ఇష్టాలే తెలిపేందుకు
మేఘాల ఒళ్ళోనే ఎదిగిందని
జాబిల్లి చల్లేనా జడివానని
ముళ్లపై మేమిలా విచ్చుకున్నామని
నీకు పూరేకులే గుచ్చుకోవేమారి
తీరమే మారినా తీరులో మారునా
మారాదూ ఆ ప్రాణం
(పపపద రారా పరుగున రారా గురువా గురువా
ఇక భయపడకుండా బయటకి తీరా చొరవా చొరవా)
ఇంకా ఎదో... ఇంకా ఎదో
ఇదై పోతావ్ ఇష్టాలే తెలిపేందుకు
వెళ్ళెళ్ళు చెప్పేసే ఏమవ్వదు
లోలోన దాగుంటే ప్రేమవ్వదు
అమృతం పంచడం నేరమే అవదురా
హాయిని పొందడం భారమే అవదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పాదా
ఇప్పుడే ఆ అందం
(పపపద రారా పరుగున రారా గురువా గురువా
ఇక భయపడకుండా బయటకి తీరా చొరవా చొరవా)
ఇంకా ఎదో... ఇంకా ఎదో
ఇదై పోతావ్ ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు
ఏదై చేరాలి ఈరోజే చెలి చెంతకు
కలలో ఈ స్వరం వినరో ఈ క్షణం
అనుకుందేది నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా
కనిపించాక మౌనాన్నే చూపించకు