DreamPirates > Lyrics > Devudu Meeku Ellapudu - దేవుడు మీకు ఎల్లప్పుడు || Songs of Zion Lyrics

Devudu Meeku Ellapudu - దేవుడు మీకు ఎల్లప్పుడు || Songs of Zion Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-12 16:27:53

Devudu Meeku Ellapudu - దేవుడు మీకు ఎల్లప్పుడు || Songs of Zion Lyrics

Devudu Meeku Ellapudu - దేవుడు మీకు ఎల్లప్పుడు || Songs of Zion Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Bro.Sharath Vattikuti
Composer :
Publish Date : 2023-11-12 16:27:53

Song Lyrics :

పల్లవి: దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా నున్నాడు

1. ఏదేనులో ఆదాముతో నుండెను - హానోకు తోడ నేగెను

దీర్ఘ దర్శకులతో నుండెను - ధన్యులు దేవునిగలవారు ॥తో॥

2. దైవాజ్ఞను శిరసావహించి - దివ్యముగ నాబ్రహాము

కన్న కొమరుని ఖండించుటకు - ఖడ్గము నెత్తినయపుడు ॥తో॥

3. యోసేపు ద్వేషింప బడినపుడు - గోతిలో త్రోయబడినపుడు

శోధనలో చెరసాలయందు - సింహాసనమెక్కినయపుడు ॥తో॥

4. ఎర్రసముద్రపు తీరమునందు - ఫరో తరిమిన దినమందు

యోర్ధాను దాటిన దినమందు - యెరికో కూలిన దినమందు ॥తో॥

5. దావీదు సింహము నెదిరించి - ధైర్యాన చీల్చినయపుడు

గొల్యాతును హతమార్చినపుడు సౌలుచే తరుమబడినపుడు||తో॥

6. పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు
అపోస్తలులు విశ్వాసులు - హింసించబడిన యపుడు.||తో॥
7. సింహపు బోనులో దానియేలు - షడ్రక్ మేషాక బెద్నెగో

అగ్ని గుండములో వేయబడన్ - నల్గురుగా కనబడినపుడు||తో॥

Tag : lyrics

Watch Youtube Video

Devudu Meeku Ellapudu - దేవుడు మీకు ఎల్లప్పుడు || Songs of Zion Lyrics

Relative Posts