DreamPirates > Lyrics > Dum Dum Nataraju Lyrics

Dum Dum Nataraju Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-19 15:04:51

Dum Dum Nataraju Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Veturi
Singer : Shankar Mahadevan
Composer : Mani Sharma
Publish Date : 2023-04-19 15:04:51

Dum Dum Nataraju Lyrics


Song Lyrics :

డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా
గుండెల్లో గురి వుంటే ఎదగాలి తారలే కళ్ళుగా
నీ మాటే నీ బాటై సాగాలి సూది సూరిడుగా
బమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆట
ఆడితప్పనే మాట అయ్యచూపిన బాట
నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హ హ హ

హేయ్ అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించరా
అల్లూరి దెబ్బ తెల్లోడి అబ్బ తొడగొట్టి చూపించరా
బ్రహ్మన్న పుత్ర హేయ్ బాలచంద్ర చెయ్యెత్తి జైకొట్టరా
పొగరున్న కొండ వెలుగున్న మంట తెలుగోడివనిపించరా
వేసంగిలోన పూసేటి మల్లి నీ మనసు కావాలిరా
వెలిగించర లోనిదీపం అహ తొలగించరా బుద్ధి లోపం
ఆత్మేరా నీ జన్మ తార సాటి మనిషేరా నీ పరమాత్మ
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా

చూపుంటె కంట్లో వూపుంటే ఒంత్లో నీకేంటి ఎదురంటా
చూపుంటె కంట్లో వూపుంటే ఒంత్లో నీకేంటి ఎదురంటా
నీవు నీకు తెలిసేల నిన్ను నీవు గెలిచేల
మార్చాలిరా మన గీత
చిగురంత వలపో చిలకమ్మ పిలుపో
గుణపాఠం వుండాలిరా
పెదవుల్లో చలి ఈల పెనవేస్తె చెలి గోల
చెలగాటం ఆడాలిరా
మారిందిరా పాతకాలం నిండు మనసొక్కటే నీకు మార్గం

డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా
గుండెల్లో గురి వుంటే ఎదగాలి తారలే కళ్ళుగా
నీ మాటే నీ బాటై సాగాలి సూది సూరిడుగా
బమాట నుంచి భామాట దాక నాదేనురా పై ఆట
ఆడితప్పనే మాట అయ్యచూపిన బాట
నమ్మినోళ్ళకిస్తా నా ప్రాణం
డుం డుం డుం నటరాజు ఆడాలి పంబరేగాలిరా
జెండాపై కపిరాజు ఎగరాలి నేల జాబిల్లిగా హ హ హ

Tag : lyrics

Relative Posts