DreamPirates > Lyrics > Edo oka ragaam song on Raja movie Lyrics

Edo oka ragaam song on Raja movie Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-05-30 15:56:53

Edo oka ragaam song on Raja movie Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : sirivenela sitarama sastry
Singer : Chitra
Composer :
Publish Date : 2024-05-30 15:56:53

Edo oka ragaam song on Raja movie Lyrics


Song Lyrics :

.. రాజా..

ఏదో ఒక రాగం పిలిచిందీ ఈ వేళా...!
నాలో నిదురించే గతమంతా కదిలేలా...!

ఏదో ఒక రాగం పిలిచిందీ ఈ వేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా...

నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు... జ్ఞాపకాలే మేల్కొలుపు..
జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు..

ఏదో ఒక రాగం పిలిచిందీ ఈ వేళా..!
నాలో నిదురించే గతమంతా కదిలేలా..!


చరణం 1
అమ్మ అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే..
రా..అమ్మా.. అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్ళలో అపుడపుడు చమరింతలు జ్ఞాపకమే...
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం...

ఏదో ఒక రాగం పిలిచిందీ ఈ వేళా..!
నాలో నిదురించే గతమంతా కదిలేలా..!

చరణం 2

గుళ్ళో కథ వింటూ నిదురించిన జ్ఞాపకమే..
బళ్ళో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే..
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే..
నెమలి కళ్ళనే దాచే చోటు జ్ఞాపకం...
జామపళ్ళనే దోచే తోట జ్ఞాపకం...

ఏదో ఒక రాగం పిలిచిందీ ఈ వేళా...!
నాలో నిదురించే గతమంతా కదిలేలా...!
నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు... జ్ఞాపకాలే మేల్కొలుపు..
జ్ఞాపకాలే నిట్టూర్పు.. జ్ఞాపకాలే ఓదార్పు..

ఏదో ఒక రాగం పిలిచిందీ ఈ వేళా
నాలో నిదురించే గతమంతా కదిలేలా..

Tag : lyrics

Relative Posts