DreamPirates > Lyrics > F Lyrics

F Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-10 00:00:00

F Lyrics

F Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : F
Composer :
Publish Date : 2023-10-10 00:00:00


Song Lyrics :

ఎగిరే రెక్కలకు
గగనం దారిస్తుంది
తగిలే దెబ్బలకు
ఫలితం చూపిస్తుంది
పడినా లేచి గెలిచే వాన్నే
పొగుడుతారు పదిమందీ

దంచికొట్టు దరువు దంచికొట్టు
బరువే దించినట్టు
మనసు గాల్లో తేలేట్టు
గజ్జె కట్టు అదిరే చిందుకొట్టు
ఉరికె ఉల్లాసమై ఊరువాడ
ఉయ్యాలూగేట్టు

సాగుచేయందే ఎంతలేసి నేలైనా
సారమయ్యేనా
(మోరునియె మోరునియె)
నాటు వెయ్యందే ఎన్ని విత్తనాలైనా
పూలు కాసేనా
(మోరునియె మోరునియె)

Advertisement

నేడు నువ్వు నాటుకున్న చెట్టు
తదుపరి తరాలకు పల్లు పంచుతుంది
తరతమాలు లేని వాళ్ళ బుట్టు
ఇదిగో వినమంటూ మర్మం చెబుతుంది

ఒకటే తల్లి కడుపున పుట్టిన మనకు
తేడాలే లేవంటుందీ

దంచికొట్టు దరువు దంచికొట్టు
బరువే దించినట్టు
మనసు గాల్లో తేలేట్టు
గజ్జె కట్టు అదిరే చిందుకొట్టు
ఉరికె ఉల్లాసమై ఊరువాడ
ఉయ్యాలూగేట్టు

Advertisement

తక్కువేంది మనకు
ఆ పైవాడి ప్రేమా ఇచ్చింది
ఎన్నో లెక్కించుకో
కోరుకున్నదే నింగి కొమ్మంచునున్నా
నిచ్చెన్లు వేసి దక్కించుకో

జాతిమతం లేని
సుగంధాల కొరకే
పూలు పుట్టినాయో
(మోరునియె మోరునియె)
నీలి మబ్బులన్నీ
నింగి జారి నేలమ్మకు
పచ్చబొడిచినాయో
(మోరునియె మోరునియె)

Advertisement

ఘల్లుమంటే కోయిలమ్మ పాట
నెమలి పింఛమాయె అడవి సయ్యాట
నింగినేలే జంట కలయునంట
మనిషి మనిషికి దూరమెందుకంటా

పగలే తొలగిన చోట
పండగ ప్రతి పూట
జనమే ఓ స్వర్గమంటా

దంచికొట్టు దరువు దంచికొట్టు
బరువే దించినట్టు
మనసు గాల్లో తేలేట్టు
గజ్జె కట్టు అదిరే చిందుకొట్టు

Tag : lyrics

Watch Youtube Video

F Lyrics

Relative Posts