DreamPirates > Lyrics > Gala Gala Paareti -Narasanna | Lyrics

Gala Gala Paareti -Narasanna | Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-10 11:03:30

Gala Gala Paareti -Narasanna | Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Nallagonda Gadder
Singer : Nalgonda Gadder
Composer : Narsanna
Publish Date : 2023-08-10 11:03:30

Gala Gala Paareti -Narasanna |  Lyrics


Song Lyrics :

గల గల్ల పారేటి గంగమ్మ తల్లంటి… చిన్నారి పొన్నారి ఈ సిట్టి సిలకమ్మ…

ఏ తల్లి కన్నాదో… ఏ ఊరు సిన్నాదో సిత్రంగా నీకే ఎదురైనాదమ్మ…

ఎన్నడు నువ్ సూడనీ… ఆనందమై ఎదురుగా ఉన్నదీ ఎందుకో ఈ బంధమే తెలిసినట్టే ఉన్నదీ…

నెర్రె బారిన నేల…. తొలి సినుకు పడగానే పులకరించినట్టు నీలో…

నింగి వాలు జడల… సింగిడి పువ్వోలె… కొత్త కొత్త సంబరాలో…

ఏడూ సంద్రాలు దాటొచ్చి… ఈ ఊరు చేరావు…

ఇంకెన్ని సిత్రాలు మునుముందు సూడాలో…

తెలుసా నీకు కొమ్మలపైనా… పువ్వులు పూసే తీరు… ఏ స్నేహం లేకున్నా…

అందరి దాహం తీర్చును… మా సెలయేరు… ఈ గాలిలోన అమ్మ జోల ఉన్నది… వినుకోర ఓ బుజ్జి కన్నా

ఈ మన్నులోన నాన్న స్పర్శ ఉన్నది…

ఘనమేదిరా దీనికన్నా కొండకొనే నీకు అండ దండ అయినాది…

పరదేశపు పసివాడా గుండె నిండ పల్లె నిను దాసుకుంటాది…

అంత ప్రేమ ఉంది ఈడా ఆ గగనవీధి వీడి నెలకొచ్చినోడా… గమనించరా అసలు ఏడుందో నీ జాడ…

Tag : lyrics

Relative Posts