Jai bheem Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Manukota prasad |
Singer : | Gadda Narsanna |
Composer : | |
Publish Date : | 2023-10-28 13:45:01 |
వెలివాడలా మాత్రమే వెలిసిరా బొమ్మ
ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మ
ఒక వాడకె పరిమితమా అంబేద్కరుడు
ప్రతివాడికి హక్కు రా నువ్వు పంచినవాడు
తను రసిండు రాజ్యాంగం దేశం కోసం
తను చేసిండు పోరాటం అందరికోసం
తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం
తను చేసిండు పోరాటం అందరికోసం
మరి చీకటినే తరిమేసి వెలుగైనాడు
జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం
అందరమొకటై గెలవాలి సమాజం
జై భీమ్ జై భీమ్ ఒక యుద్ద నినాదం
అందరికోసం మది పోరు ప్రవాహం
మాకెందుకు మాది కాదు ఆనినాదం
అని అవగాహన లేకున్నది కొంత సమాజం
ఆహా రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం
గది అంటే ఏందని అడిగే అవి వేకుల దేశం
జీవితాన్ని ధారపోసినాడురా మనకై
అవమానాలనుభవించి నిలిచేరా బలమై
భావితరాల బతుకును మారుసుట కొరకై
అనసబడిన వాళ్ల కొరకు పుట్టెరా వెలుగై
నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాతా
నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే
నువ్వు పొందే ఏ పదవి అయినా ఆయన బిక్షే
జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం
అందరమొకటై గెలవాలి సమాజం
జై భీమ్ జై భీమ్ ఒక్క యుద్ధ నినాదం
అందరి కోసం మది పోరు ప్రవాహం
జర జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో
ఆహా జననం జన అజ్ఞానం తొలుచుటకోరుకో
గా జై భీమ్ అని గొంతెత్తి నినదించాలో
ఆహా బడుగు బహుజనులంత ఏకమవాలో
విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా
నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ
అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు
పీడిత జన గోసలనే తరిమిన వాడు
ఎంతమంది ఎత్తుకునేను జై భీమ్ జెండా
ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అండ
మనమందరం ఒకటి అయితే విజయం రాగా
జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం
అందరమొకటై గెలవాలి సమాజం
జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం
అందరి కోసం మది పోరు ప్రవాహం