Kaaparivai Mammu Nadipinchaavu || కాపరివై మమ్ము నడిపించావు || Dr.Asher Andrew Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Dr. Asher Andrew |
Singer : | Dr. Asher Andrew |
Composer : | Dr. Asher Andrew |
Publish Date : | 2023-05-26 07:48:22 |
కాపరివై మమ్ము నడిపించావు బాధలన్నిటిలో - ఓదార్చి || 2 ||
ఆత్మచే మమ్ము నడిపించావు సమృద్ధి జీవములో
మూడవ వార్షిక ఉత్సవ మందు వందనంబు నార్తుమూ - మా ప్రభో
సంఘముగా మా ఈ స్తుతి - నీ పాదముల చెంతనే || 2 ||
అ:ప : ఆరాధన నీకే ఆరాధన మహిమ ప్రభావ మా యేసు ప్రభువా || 2 ||
1. భారమైన ఈ యాత్రను నడువలేము అనగా
మా వెన్ను తట్టి నీ చేత పట్టి నడిపించావు నేటివరకు - ఎబినేజరువై || 2 || || ఆరాధన || || కాపరివై ||
2. కార్యము ఆల్పమై ఉండగా తృణీకరించినవాడెవడు
ఈ మందిర పునాది వేసిన జెరుబ్బాబెలు నీదు చేతులే - ముగించును || 2 || || ఆరాధన || || కాపరివై ||
3. మా శక్తి చూచి పరిచర్య ఒత్తిడి భరించలేమని కృశించగా
మా శక్తి బలము చేత కాదని జరిగించావు కేవలము నీ ఆత్మతో || 2 || || ఆరాధన || || కాపరివై ||
4. ప్రతికూలమైన తూఫానులో కలవరము చెందగా
వాగ్దానం ఇచ్చి పిలిచిన వాడు నమ్మదగిన ఆ దేవుడే మమ్ము నడిపించును || 2 || || ఆరాధన || || కాపరివై ||
5. మా తృష్ణ కొలది నీ మందిరా తేజోమహిమ తోడ
సంతృప్తి పరచి పోషించితివి సమృద్ధి అయిన నీదు వాక్యపు మన్నాతో || 2 || || ఆరాధన || || కాపరివై ||