DreamPirates > Lyrics > Keeravani Chilakala, Anveshana | Spb, S.Janaki Lyrics

Keeravani Chilakala, Anveshana | Spb, S.Janaki Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-12-13 08:23:09

Keeravani Chilakala, Anveshana | Spb, S.Janaki Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Veturi
Singer : Sp. Balasubramanyam, S.Janaki
Composer : Ilaiyaraaja
Publish Date : 2023-12-13 08:23:09

Keeravani Chilakala, Anveshana | Spb, S.Janaki Lyrics


Song Lyrics :

సా... నిసరిసాని... సా నిసమగామరి

పదసా.నిసరీసాని... సా.నిసమగామరి

పద సససని రిరిరిస గగగరి మమమగ పా...

సా ని ద ప మ గ రి స ని.

కీరవాణి... చిలకలా కొలికిరో పాడవేమే

వలపులే తెలుపగా విరబూసిన ఆశలు

విరితేనెలు చల్లగ అలరులు కురిసిన

ఋతువుల తడిసిన మధురసవాణి

కీరవాణి చిలకలా కొలికిరో

పాడవేమే వలపులే తెలుపగా

గరిస పమగ పాని సరిగ రిగస నీ పా.

ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై

నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా

నీ గగనాలలో నే చిరుతారనై

నీ అధరాలలో నే చిరునవ్వునై

స్వరమే లయగా ముగిసే.

సలలిత కలరుత స్వరనుత

గతియుత గమకము తెలియకనే...

కీరవాణి చిలకలా కలకలా పాడలేదు

వలపులే తెలుపగా ఇలరాలిన పూవులు

వెదజల్లిన తావుల అలికిడి ఎరుగని

పిలుపుల అలిగిన మంజులవాణి

కీరవాణి చిలకలా కలకలా పాడలేదు

వలపులే తెలుపగా

నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై

సంపెంగలా గాలినై తారాడనా నీడనై

నీ కవనాలలో నే తొలి ప్రాసనై

నీ జవనాలలో జాజుల వాసనై ఎదలో ఎదలే కదిలే

పడచుల మనసుల పంజర శుకముల పలుకులు తెలియకనే

కీరవాణి చిలకలా కలకలా పాడలేదు

వలపులే తెలుపగా

విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగ

అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి

కీరవాణి చిలకలా కొలికిరో

పాడవేమే వలపులే తెలుపగా

Tag : lyrics

Relative Posts