DreamPirates > Lyrics > Legara Sambayya Legara folk Telugu song Shiva ratri song Charan Arjun Lyrics

Legara Sambayya Legara folk Telugu song Shiva ratri song Charan Arjun Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-10 16:57:53

Legara Sambayya Legara folk Telugu song Shiva ratri song Charan Arjun Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Charan Arjun
Singer : Veeha, Bikshamamma
Composer : Charan Arjun
Publish Date : 2024-03-10 16:57:53

Legara Sambayya Legara folk Telugu song   Shiva ratri song  Charan Arjun Lyrics

Song Lyrics :

పన్నెండు స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

వెన్నీళ్ళు చన్నీళ్ళు ఏకము చేసినము సానమాడంగా లెగరా

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

మల్లేలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

చరణం : 1

నీ భాష ఏందయ్యా నీ యాస ఏందయ్యా మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా

మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా

మీ ఊరు ఏందయ్యా అసలు పేరు ఏందయ్యా ఏ ఊరుకేళిన కండ్లముందు ఉంటవు శివయ్యా

ఏ ఊరుకేళిన కండ్లముందు ఉంటవు శివయ్యా

నిలువెళ్లా కళ్ళటా.... ముల్లోకా పాలనా..... సల్ల సల్లగుంటది స్వామి నీ ఆలనా

ఏ విసుగు లేక నసుగు లేక భరిస్తావు కన్నతండ్రిలా...కంఠాన నల్లనాగు నీ కంట ప్రేమ వాగు

కంఠాన నల్లనాగు నీ కంట ప్రేమ వాగు

మేం నీకన్న పేగు మా ముందు కొంచెం ఆగు

మేం నీకన్న పేగు మా ముందు కొంచెం ఆగు

నీ భాష ఏందయ్యా నీ యాస ఏందయ్యా మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా

మా గోస నీకు సమజయ్యేది ఎట్టా శివయ్యా

పరమశివుడని నేనేడుకుంటే పాములోడంటారు గదరా

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

గరళకంఠుడాని నేనానుకుంటే గంగిరేడ్లోడు అంటారు కదరా

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

కాశీనాథుడని నేనానుకుంటే కాటిలో పండ్తవాటయా

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

సాములోరువని నేను మొక్కుతుంటే సన్నాసి వంటరెందయ్యా

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

చరణం : 2

గుణరూపా రసగంగా స్పర్శార్ధ సమస్తము విశ్వాన విధ్వంసం .... ఆపే రణతత్వము

ఆపే రణతత్వము

సూరీడు చందురుడు అగ్గియే త్రినేత్రము నేర్పినావు ఏక్షణమున ఏట్టుండాలనే సూత్రము

ఎట్టుండాలనే సూత్రము

తరించి తనువు మొత్తము భస్మధారి భస్మము కడన మిగులు బూడిదని చాటినావు సత్యము

ఆలికి ఇచ్చీ సగ దేహము తీర్చావు సందేహము ఆలుమగలు ఒకటేనని అందు అంతరార్థము

అపురూపము నీ రూపం అది జనదీపము నీలాల బంగారు కొండా నిండావు గుండెనిండా

నిండావు గుండెనిండా

వెధించి ఇస్తవు అండ నీ మాయ సల్లగుండా

వెధించి ఇస్తవు అండ నీ మాయ సల్లగుండా

కంఠంలో దాచుకున్న కాలకుట గరళము మంచి కొరకు కష్టాలు దాటమనే పాఠము

దాటమనే పాఠము

నిరంతరం ప్రవహించే స్వచ్ఛనది గంగను తలన ఉంచి తెలిపినావు మాకు జలము విలువను

మాకు జలము విలువను

ఆనందాలను సూచించే నంది నీవాహనము ఆపదలకు జడగట్టే నేర్పేనాగాభరణం

ఆ స్మశానమే నీ విహార భూమి అయిన వైనము అందరి అంతిమయాత్ర అదే అన్న అర్థం

సహనాలను సమకూర్చేను నీ విభిన్నా విధం వెండికొండలేలేటోడా ఎటుచూడా శంకరుడా

ఎటుచూడా శంకరుడా

శివశబ్దమయ్యి నిత్యం ఒదిగుండు గుండె కాడా

శివశబ్దమయ్యి నిత్యం ఒదిగుండు గుండె కాడా

దిక్కు నీవే మాకు రెక్క నీవే మాకు సక్కని ఓ శంకరయ్య

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

ఒక్కపొద్దులుండి నిన్ను మొక్కినాము సక్కదిద్దు మా బతుకు

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

లోకజ్ఞానం లేక ఇన్నడుగుతున్నాము లోపమనకా బదులు చెప్పు

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

శివుడాజ్ఞ లేనిదే చీమన్న గుట్టదు అంతా నీ ఆటగదరా

లెగరా సాంబయ్య లెగరా నా అయ్యా లెగరా పరమాత్మ లెగరా

Tag : lyrics

Relative Posts