Maa Bava Manobhavalu song Lyrics - Veera Simha Reddy Movie Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Rama Jogaiah Sastry |
Singer : | Sahithi Chaganti, Satya Yamini, Renu Kumar |
Composer : | Thaman S |
Publish Date : | 2023-01-05 00:00:00 |
కోరస్: బావ బావ బావ
బావ బావ బావ
హలో బావ బావ బావ
బావ బావ బావ
ఆమె: చుడీదారు ఇస్తామంటా ఆడికి
వద్దొద్దన్నా ఎండలకాలం వేడికి
ఎంచక్కా తెల్ల చీర కట్టి
జళ్ళో మల్లెపూలు చుట్టి
ఎళ్ళేలోపే ముఖం ముడుసుకున్నడే
కోరస్: మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
బావ బావ బావ… బావ బావ బావ
ఆమె: అత్తరు ఘాటు నచ్చదంట ఆడికి
అదే రాసుకెల్లా నేను ఒంటికి
ఇక చూస్కో నానా గత్తర చేసి
ఇల్లు పీకి పందిరేసి
కంచాలొదిలి మంచం కరుసుకున్నడే
కోరస్: మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
బావ బావ బావ… బావ బావ బావ
ఆమె: బావ బావ బావ… బావ బావ బావ
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
ఆమె: ఖతార్ నుండి కన్నబాబని
ఇస్కూలు ఫ్రెండు ఇంటీకొస్తేను
ఈడెందుకు వచ్చిండని
ఇంతెత్తునెగిరి రేగాడిండే
ఆమె: ఓటర్ లిస్టు ఓబుల్ రావు
వయసెంతని నన్నడిగితేనూ
గదిలో దూరి గొల్లాలేసి
గోడల్ బీరువాలు గుద్దేసిండే
ఆతడు: యేటి సేద్దామే తింగర బుచ్చి
ఆడికేమో నువ్వంటే పిచ్చి
ఏదో బతిమాలి బుజ్జాగించి
చేసేసుకో లాలూచి
ఆమె: హే మెత్తగుండి మొండిగుంటడు
ఎడ్డం అంటే తెడ్డం అంటడు
సీటికి మాటికి సిన్నబుచ్చుకుంటాడే
కోరస్: మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే
మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి
బావ బావ బావ… బావ బావ బావ