DreamPirates > Lyrics > Madhuramu Kadha Song Telugu Vijay Devarakonda Mrunal Lyrics

Madhuramu Kadha Song Telugu Vijay Devarakonda Mrunal Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-25 07:46:48

Madhuramu Kadha Song Telugu Vijay Devarakonda Mrunal Lyrics

Film/Album :
Language : Portuguese (Brazil)
Lyrics by : Shree Mani
Singer : Shreya Ghoshal
Composer : Gopi Sundar
Publish Date : 2024-03-25 07:46:48

Madhuramu Kadha Song Telugu   Vijay Devarakonda Mrunal  Lyrics


Song Lyrics :

Madhuramu Kadha Song Telugu Lyrics | Vijay Deverakonda, Mrunal | Gopi Sundar | Parasuram

పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘమ్మల్లె

అలజడి హృదయం ఆడినా.....కూచిపూడి

రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లే

సంతోషములో ముద్దుగా ఈ.... అమ్మాడి

ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగా పుంతలు తొక్కినది ఈ అరవిందం

అమ్మమ్మో తాండవ మాడే కృష్ణుడు నుండి వేణువు గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

మధురము కదా ప్రతొక నడక నీతో కలిసి ఇలా....

తరగని కథా మనది గనుక మనసు మురిసెనిలా

ఉసురేమో నాదైనా నడిపేది నీవుగా....

కసురైన విసురైన విసుగైనా రాదుగా...

పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘమ్మల్లె

అలజడి హృదయం ఆడినా.....కూచిపూడి

రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లే

సంతోషములో ముద్దుగా ఈ.... అమ్మాడి

ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగా పుంతలు తొక్కినది ఈ అరవిందం

అమ్మమ్మో తాండవ మాడే కృష్ణుడు నుండి వేణువు గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

ఏదో సంగీతమే హృదయమున ఎంతో సంతోషమే

క్షణములో గాల్లో తేలిన భ్రమే తిరిగి నవ్వింది ప్రాయమే

ఏదో సవ్వడి విని టక్కుమని తిరిగానే నువ్వని

మెరుపుల నువ్వు వస్తున్నావని

నీ పేరే పలికినదో ఏ మగువైన తగువేగా

నీ గాలే తాకినదో చిరుగాలైన చంపెయనా

హెచ్చరిక చేసినా నీకు నీడైనా

వెన్నెలను నిన్ను వదలమని వైనం ప్రతి నిమిషమున

హక్కులు ఇవి నాకు మాత్రం అవి సొంతం

ఇలా నీ పైన

ఆరారు ఋతువుల అందం ఒకటిగా కలిపి వింతలు ఏడు పక్కకు జరిపి కొత్తగా పుంతలు తొక్కినది ఈ అరవిందం

అమ్మమ్మో తాండవ మాడే కృష్ణుడు నుండి వేణువు గానం తీయగ పండి రాధకు ప్రాణం ఉప్పొంగే ఆనందం

మధురము కదా ప్రతొక నడక నీతో కలిసి ఇలా....

తరగని కథా మనది గనుక మనసు మురిసెనిలా

పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘమ్మల్లె

అలజడి హృదయం ఆడినా.....కూచిపూడి

పించం విప్పిన నెమలికిమల్లె తొలకరి జల్లుల మేఘమ్మల్లె

అలజడి హృదయం ఆడినా.....కూచిపూడి

రంగులు దిద్దిన బొమ్మకుమల్లె కవితలు అద్దిన పుస్తకమల్లే

సంతోషములో ముద్దుగా ఈ.... అమ్మాడి

Madhuramu Kadha Song Telugu Lyrics | Vijay Deverakonda, Mrunal | Gopi Sundar | Parasuram

Tag : lyrics

Relative Posts