Mellaga tellarindo yela - Shatamaanam bhavati - Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Srimani |
Singer : | Anurag kulakarni,Ramya behra, Mohana bhogaraju |
Composer : | Micky j mayer |
Publish Date : | 2023-01-02 00:00:00 |
చిత్రం: శతమానం భవతి
మెల్లగా తెల్లారిందో ఎలా
వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా...
చేదతో బావులలో గల గల
చెరువులో బాతుల ఈతల కళ
చేదుగా ఉన్న వేపను నమిలే వేళ
చుట్ట పొగ మంచుల్లో
చుట్టాల పిలుపుల్లో
మాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించి అందించు హృదయంలా
చలిమంటలు ఆరేలా
గుడి గంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా
గువ్వలు వచ్చే వేళ
నవ్వులు తెచ్చే వేళ
స్వాగతాలవిగో కనవేలా
పొలమారే పొలమంతా
ఎన్నాళ్లొ నువు తలచీ
కళ మారే వూరంతా
ఎన్నేళ్లొ నువు విడచీ
మొదట అందని దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహతహలాడిన
పసితనమే గుర్తొస్తుందా
ఇంతకన్నా తియ్యనైన జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాన
నువ్వూగిన ఉయ్యాలా
ఒంటరిగా వూగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడకా
నువ్వాడిన దొంగాట
బెంగల్లే మిగలాలా
నన్నెవరూ వెతికే వీల్లేకా
కన్నులకే తియ్యదనం
రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం
పలికించే సెలయేళ్లే
పూల చెట్టుకి ఉందో భాష
అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్లే లేరే
అందం మాటాడే భాష
పలకరింపే పులకరింపై
పిలుపునిస్తే పరవశించడమే
మనసుకు తెలిసిన భాష
మమతలు పెంచే వూరు
ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరూ
ప్రేమలు పుట్టిన వూరు...
అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరూ...
చిత్రం: శతమానం భవతి
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, మోహన భోగరాజు
సంగీతం: మిక్కీ జె.మేయర్
రచన: శ్రీమణి