Merise Mabbula Song-Kanupaapa | MG Sreekumar & Shreya Jaydeep Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Mohanlal, Vimala Ram |
Singer : | MG Sreekumar & Shreya Jaydeep |
Composer : | Jim | Biby | Eldhose |
Publish Date : | 2023-01-09 00:00:00 |
మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నీకై
వరమై రాడా నీ నాన్న
మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై
వరమై వస్తాడా నాన్న
తీయని ఊహల్లో తేలే కథలు మాటలు చెప్పే
వరమై రాడా నీ నాన్న
పెదవులలో పలికెనులే మధురసరాగం
నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం
ముద్దు ముద్దు మాటల్లోన విచ్చే పువ్వేనా
బుల్లి బుల్లి పాదం వెంట వచ్చే నీ నాన్న
మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై
వరమై వస్తాడా నాన్న
వరమై వస్తాడా నాన్న
అందాలూ చిందేటి ముత్యాలు జుంకాలు
ఊయాలు ఊగు వేళా
చల్లంగా బజ్జోవా మీ నాన్న ఒళ్ళోన వింటూ నీ జోల
ఆగు వరకల్లి నించేల మిన్నుల్లో
చిందేయు సందడ్లో
తారల్ని తాకేలా సాగిపోవాలంట పండు వెన్నెల్లో
పగలు రేయి ఒక నేడల్లె
కాయాలి కనుపాపవై
మా నాన్న కురువాలి నింగి మబ్బై
గుండెల్లో దాచెంతగా ప్రేమంతా చూపాలి ఈ కొనపై
మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నీకై
వరమై రాడా నీ నాన్న
బొట్టు కాటుకెట్టి మంచి బట్టలేసి
నాతో బడి దాక బోలెడన్ని
నాకు చిట్టి ముద్దులిస్తూ తోడే వస్తాడు
నీ నవ్వు చూసేటి మీ నాన్న కన్నుల్లో
ఆనంద బాష్పాలే
నీ కంట నీరోస్తే ఆ గుండె లోతుల్లో నిత్యం మంటల్లె
పసితనం అంతా ఎదిగినా కానీ
మీ నాన్న ముందు నువ్వు
విరియని తామర పువ్వేనంటా
ఎంత అల్లరినైనా కానీ
అది ఒక కమ్మని దోబుచాట
మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నాకై
వరమై వస్తాడా నాన్న
పెదవులలో పలికేనులే మధురసరాగం
నువ్వు తొడిగే గాజులలో చిరు సంగీతం
ముద్దు ముద్దు మాటల్లోన విచ్చే పువ్వేనా
బుల్లి బుల్లి పాదం వెంట వచ్చే నీ నాన్న