DreamPirates > Lyrics > Modhugu Puvvai Folk Song Thirupathi Matla Divya Maalika Lyrics

Modhugu Puvvai Folk Song Thirupathi Matla Divya Maalika Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-05 11:43:29

Modhugu Puvvai Folk Song Thirupathi Matla Divya Maalika Lyrics

Film/Album :
Language : Dutch
Lyrics by : Thirupathi Matla
Singer : Divya Maalika
Composer : Thirupathi Matla
Publish Date : 2024-03-05 11:43:29

Modhugu Puvvai Folk Song   Thirupathi Matla  Divya Maalika Lyrics

Song Lyrics :

మోదుగు పువ్వై నేను పూసినాను అడవి అందాలన్నీ అరబోసినాను
అడవి అందాలన్నీ అరబోసినాను కొండ సిరిమల్లీనై కొంగు పరిసినాను
గుండె నంతా పిండుతున్నావయ్యో.... గుండు సూదులోలే గుచ్చుతున్నావయ్యో
అయినా గాని నచ్చుతున్నావయ్యో.... పుణ్యముంటది నీకు వచ్చిపోరాదయ్యో..
మోదుగు పువ్వై నేను పూసినాను అడవి అందాలన్నీ అరబోసినాను
అడవి అందాలన్నీ అరబోసినాను కొండ సిరిమల్లీనై కొంగు పరిసినాను
రేనా... రేనారే.... రేనారే.... రేనారే...‌ రేనా.... రేనారే..... రేనా ... ఆ... ఆ....

చరణం: 1
గుట్ట గుట్టల నడుమ గుంపు గుంపుల నడుమ
ఎత్తు పంపుల నడుమ వాగు వంకల నడుమ
తిరిగి తిరిగి నువ్వు గావర అయినవేమో
నా ఒడిని పానుపు చేస్తా ఒరిగిపోతావా ఎదలో ఒదిగిపోతావా
మోదుగు పువ్వై నేను పూసినాను అడవి అందాలన్నీ అరబోసినాను
అడవి అందాలన్నీ అరబోసినాను కొండ సిరిమల్లీనై కొంగు పరిసినాను

చరణం: 2
కన్నె సోకులు కలిపి జొన్న రొట్టెలు చేసి
ఉరా కొడిని కోసి వండుకొస్తిని పిల్లగా
సంటి పిల్లగానోలే సంకనేత్తుకోని
గోరుముద్దలు పెడతా కాస్త తినిపో పిలగా
మోదుగు పువ్వై నేను పూసినాను అడవి అందాలన్నీ అరబోసినాను
అడవి అందాలన్నీ అరబోసినాను కొండ సిరిమల్లీనై కొంగు పరిసినాను
చరణం: 3
సెట్టు కొమ్మలనడుగు సెక్క బొమ్మలనడుగు
పూల రెమ్మలనడుగు సెప్పుతాయి నీకు
నువ్వు నేను ఒక్కటవ్వాలని సెలయేటి తీరు సాగిపోవాలని ఆగిపోవద్దని
మోదుగు పువ్వై నేను పూసినాను అడవి అందాలన్నీ అరబోసినాను
అడవి అందాలన్నీ అరబోసినాను కొండ సిరిమల్లీనై కొంగు పరిసినాను
రేనా... రేనారే.... రేనారే.... రేనారే...‌ రేనా.... రేనారే..... రేనా ... ఆ... ఆ....
రేనా... రేనారే.... రేనారే.... రేనారే...‌ రేనా.... రేనారే..... రేనా ... ఆ... ఆ....

చరణం:4
మూగ మనసు బాధా నువ్వు తెలుసుకొరా
నాగమల్లే తీగై నన్ను అల్లుకోరా
మసుక చీకటిలోనా ఇసుక తెన్నెల మీదా
పండు వెన్నెల గురువంగా మనం ఆడుకుందామా ఈడును వేడుకుందామా
మోదుగు పువ్వై నేను పూసినాను అడవి అందాలన్నీ అరబోసినాను
అడవి అందాలన్నీ అరబోసినాను కొండ సిరిమల్లీనై కొంగు పరిసినాను

Tag : lyrics

Relative Posts