DreamPirates > Lyrics > Nammaka tappani Lyrics

Nammaka tappani Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-05 15:49:56

Nammaka tappani Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sirivennela seethaar
Singer : Sagar, Sumangali
Composer : DSP
Publish Date : 2023-09-05 15:49:56

Nammaka tappani  Lyrics


Song Lyrics :

నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనోదీలేనా ఓ
ఎందరి తో కలిసున్న నేనొంటరిగానే ఉన్న
నువ్వొడిలిన ఈ ఏకాంతంలోనా ఓ
కన్నులు తెరిచే ఉన్న నువ్వు నిన్నటి కలవే ఐన
ఇప్పటికీ ఆ కలలోనే ఉన్నా
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
ఈ జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడి గంటను ఇక నా మది వింటుందా...


నా వెనువెంట నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏ చోటైనా నను గుర్తిస్తుందా
నిలువున నను తరిమి అల
వెనుదిరిగిన చెలిమి ఎలా
తడి కనులతో నిను వెతికేది ఎలా
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న...
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ.....


నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళైన సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళైన ఈ నడి రాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా సిరిమల్లెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా
నమ్మక తప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్న
ఎందుకు వినదొ నా మది ఇప్పుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్న నువ్వేమో అనుకుంటున్న
నీ రూపం నా చూపులనోదీలేనా ఓ....

?

Tag : lyrics

Relative Posts