Nannaku Prematho Song Lyrics Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Devi Sri Prasad |
Singer : | దేశి శ్రీ, సాగర్ |
Composer : | Rockstar DSP |
Publish Date : | 2022-11-14 00:00:00 |
‘ఏ కష్టం ఎదురొచ్చినా...
కన్నీళ్లు ఎదిరించినా..
ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం
నే ఏ దారిలో వెళ్లినా..
ఏ అడ్డు నన్నాపినా..
నీ వెంట నేనున్నానని నను నడిపించినా
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో.. అంకితం నా ప్రతీక్షణం
ఏ తప్పు నే చేసినా..
తప్పటడుగులే వేసినా..
ఓ చిన్ని చిరునవ్వుతోనె నను మన్నించినా..
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో.. అంకితం నా ప్రతీక్షణం
ఏ ఊసు నే చెప్పినా..
ఈ పాట నే పాడినా..
భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయినా..
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో.. అంకితం నా ప్రతీక్షణం
ఈ అందమైన రంగుల లోకానా..
ఒకే జన్మలో వందల జన్మలకు ప్రేమనందించిన
నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో..
నాన్నకు ప్రేమతో వందనం ఈ పాటతో
ఈ పాటతో.. ఈ పాటతో’...