Nee dhirghashantame Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Hermon Aradhana Keerthanalu |
Composer : | Hermon Aradhana Keer |
Publish Date : | 2023-10-10 18:54:19 |
నీ దీర్ఘ శాంతమే - నన్ను ఇలలో నిలిపినది
నీ దయా దాక్షణ్యతే నాకు దారి చూపినది.
దయాళుడా-నాయేసయ్యా
దీర్ఘశాంతుడవు నీవేనయ్యా (నీ దీర్ఘ శాంతమే)
1. బాధించిన నన్ను భరియించినావు
విసిగించినా నన్ను విసరివేయ లేదు యేసయ్యా..
నీ ప్రేమ నన్ను మరచిపోలేదు
నీ కృపనన్ను విడచిపోలేదు యేసయ్యా (2) ॥నీ దీర్ఘ శాంతమే॥
2. వేటగాని ఉరి నుంచి తప్పించినావు
ఎబినేజరుడ నన్ను కాపాడినావు యేసయ్యా(2)
నీ ప్రేమ నన్ను మరచిపోలేదు
నీకృప నన్ను విడిచిపోలేదు యేసయ్యా (2) ॥నీ దీర్ఘ శాంతమే॥
3. కరుణించినావు కృపచూపినావు
వ్యాధులన్నిటిలో స్వస్థపరచినావు యేసయ్యా..(2)
నీప్రేమ నన్ను మరచిపోలేదు
నీ కృప నన్ను విడచిపోలేదు యేసయ్యా(2) ॥ నీ దీర్ఘ శాంతమేని