DreamPirates > Lyrics > Nindu punnani vela... Lyrics

Nindu punnani vela... Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-11-14 00:00:00

Nindu punnani vela... Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Suman badanskala
Singer : Suman badanskala, Srinidhi
Composer : Kalyan keys
Publish Date : 2022-11-14 00:00:00

Nindu punnani vela... Lyrics


Song Lyrics :

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే, ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపులవాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకేలరా ఓ పిలగా
సాలించు నీ మాటరా

నా ఊహల రాణి
నువ్వే నా తోడని
పేరు రాసుకున్ననే
కలిసుండే రోజుల్ల
నూరేళ్ళ బంధమని
రూపు గీసుకున్ననే

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే, ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపులవాడ
కోరి నన్నడగంగ
కోరిక నీకేలరా ఓ పిలగా
సాలించు నీ మాటరా

సినుకమ్మ మెరుపమ్మ
సిందేసి ఆడంగ
నెమలమ్మ నృత్యానివే, ఓ పిల్ల
పాట కోయిలమ్మవే

మాటలే మత్తులు… సూపులే సూదులు
గుండెల్లో గుచ్చకురా, ఓ పిలగా
నన్నేదో సేయకురా..!
పచ్చిపాల తీరు… నీ లేత నవ్వులు
ఎంతో ముద్దుగున్నవే
నింగిలో తారలు తల దించే అందము
నిన్నట్ట నే ఇడువనే

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే, ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపులవాడ
కోరి నన్నడగంగ కోరిక నీకేలరా
ఓ పిలగా సాలించు నీ మాటరా

తూర్పు కొండల నడుమ
నిండుగా విరిసిన అందాల సింగిడివే
ఓ పిల్ల… సూడ సక్కని గుమ్మవే
కను సైగ చేస్తావు… నా ఎంట వస్తావు
మావోల్లు చూస్తారురా ఓ పిలగా
నన్నిడిసి ఎళ్ళిపోరా

ఆ రంభ ఊర్వశీ… ఈ నేలన జారి
నీలా మారేనేమోనే
ఏ జన్మల జేసిన పుణ్యమో
నిన్ను మరిసి ఉండలేనులే

నిండు పున్నమి వేళ
ముద్దుంగ నవ్వేటి
అందాల జాబిల్లివే, ఓ పిల్ల
సొగసైన సిరిమల్లెవే

కొంటె చూపులవాడ
కోరి నన్నడగంగ కోరిక నీకేలరా
ఓ పిలగా సాలించు నీ మాటరా

ఆశలెన్నో లోన చిగురిస్త ఉన్నవి
నన్ను అడుగుతున్నవే, ఓ పిల్ల
నిన్ను కోరుతున్నవే
మాయేదో చేసినవ్… నా మనసు దోసినవ్
నాలోకమైనావురా ఓ పిలగా
నీమీద మనసాయేరా

నా సిక్కని ప్రేమల… సెక్కిన దేవతగా
నిన్ను కొలుసుకుంటనే
అడుగుల్ల అడుగేసి… నీలోన సగమయ్యి
నిన్ను జూసుకుంటనే

ఏడేడు జన్మల విడిపోని బంధమై
నీ తోడు నేనుంటనే, ఓ పిల్ల
కలకాలం కలిసుందమే
ఏడేడు జన్మల విడిపోని బంధమై
నీ తోడు నేనుంటరా ఓ పిలగా
కలకాలం కలిసుంటరా

Tag : lyrics

Relative Posts