Ninnala Monnala Chirunavvuto S. P. Balu Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Sirivennela Sitarama |
Singer : | S. P. Balu |
Composer : | Mani Sharma |
Publish Date : | 2023-11-21 06:46:40 |
నిన్నలా మొన్నలా లేదురా
ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా
అన్నిటా అంతటా తొందరా
రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా
నిన్నలా మొన్నలా లేదురా
ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా
అన్నిటా అంతటా తొందరా
రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా
ఇల్లు చూసి సెల్లుఫోను బిల్లు చూస్తేనే
భామ చూసి నవ్వుతుందిరా
ఇంగిలీషు భాషలోన ప్రేమిస్తేనే
ఆమె నిన్ను మెచ్చుతుందిరా
ప్రేమంటే అర్ధం అంతా
ఐ లవ్ యూ లో లేదయ్యో
గుండెల్లో భావం మొత్తం
గ్రీటింగ్ కార్డే కాదయ్యో
నిన్నలా మొన్నలా లేదురా
ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా
అన్నిటా అంతటా తొందరా
రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా
మనసంటూ మరోటంటూ అతిగా ఫీలైపోకమ్మా
మజ్నూలా ఇదైపోతూ ఫోసెందుకు మామా
విరహాలు వియోగాలు బీసీనాటి సరంజామ
వీ చానెల్ రోజుల్లో అవినీకవసరమా
లవ్ కి లైఫ్ కి లింకు పెట్టుకుందుకి
దేవదాసు రోజులా ఇవి
రోమియో జూలియెట్ లాగ చావటానికి
సిద్ధపడ్డ ప్రేమలా ఇవి
నిన్నలా మొన్నలా లేదురా
ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా
అన్నిటా అంతటా తొందరా
రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా
క్యాషుంటే ఖరీదైన బహుమానాలే కొనిపెట్టు
క్లుప్తంగా పనైపోయే మార్గం కనిపెట్టు
టైముంటే అదే పనిగా మాటల్తో మతిపోగొట్టు
లేకుంటే ఐ యాం సారీ మంత్రం సరిపెట్టు
కాగితం పూలకి అంటుకున్న సెంటురా
నేటి కొత్త ప్రేమ ఫార్ములా
జీవితం స్కేలులో చిన్న సెంటిమెంటురా
అంతకన్న సీనులేదురా
నిన్నలా మొన్నలా లేదురా
ఇవాళ కాలమే స్పీడుగా ఉందిరా
అన్నిటా అంతటా తొందరా
రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా