DreamPirates > Lyrics > Nitho Edadugulu Song - Bullet Bandi Laxman Lyrics

Nitho Edadugulu Song - Bullet Bandi Laxman Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-10-31 09:07:40

Nitho Edadugulu Song - Bullet Bandi Laxman Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Laxman
Singer : Ram Adnan
Composer : Bullet Bandi Laxman
Publish Date : 2023-10-31 09:07:40

Nitho Edadugulu Song  - Bullet Bandi Laxman Lyrics


Song Lyrics :

నాపై మనసుపడి నీకేం లాభం
నీపై మనసుపడితే ఓర్వదే లోకం
నాపై ప్రేమ పెంచుకోకే దీపం
చిమ్మ చీకటైపోతది లోకం

నువ్వే ఆకాశమంతా
నేనే నీ చెంత ఎంతా
నువ్వే ఆ మేడలోనా
నేనే నీ నీడలోనా

నీతో ఏడడుగులు వేయలేనులే
నీతో జీవితమే పంచుకోనులే
మెళ్ళో మూడు ముళ్ళు వేయలేనులే
నీతో వందేళ్ళే ఉండలేనులే

Advertisement

చందనాలు నింపుకున్న
చక్కనైన చందమామ
చెమ్మగిల్లకమ్మ నల్లనయ్యనే గనకా
యశోదమ్మ శిరోభారమైనవాడి అల్లరోడు
నలుగుతున్నడమ్మ నీ ప్రేమకు వెనకా

ఎటోళ్ల మల్లెలాగా
చూపు ఈ ప్రేమకునియ్యా
రేపల్లే వెన్నెలాగా
యేటి నీ అల్లరి గోలా

ఏం బతుకులే నావి
నా బాధలే నావి
నీతో నీ సరితూగలేనులే
నా బదులుగా నువ్వు
నీ బంధమైనోన్ని
మనసే పడితే బాధగుండదే

Advertisement

ఎవరమ్మా నువ్వు ఏ దొరసాని
మనసే పడుతున్నవే ఈ పేదోన్ని
ఒకటై దూరమయ్యె బదులుగ ఎట్టా
నాకు నేనే దూరంగా ఉంటా

నీతో ఏడడుగులు వేయలేనులే
నీతో జీవితమే పంచుకోనులే
మెళ్ళో మూడు ముళ్ళు వేయలేనులే
నీతో వందేళ్ళే ఉండలేనులే

Advertisement

బంగారు బొమ్మలాగ
పెరిగినవమ్మ నువ్వు
నా ఇంట బాధలు
నీ కంట వద్దులే

బంగారు బిందెతోని
నా కాళ్ళు కడగలేరు
నీ కాలికే మెట్టనెట్ట అవుదునే

అందని ఆశపడి ఏమిటి లాభం
చివరికి మిగిలేనే ఇరువురి శోఖం
ఒకటై దూరమయ్యె బదులుగ ఎట్టా
నాకు నేనే దూరంగా ఉంటా

నీతో ఏడడుగులు వేయలేనులే
నీతో జీవితమే పంచుకోనులే
మెళ్ళో మూడు ముళ్ళు వేయలేనులే
నీతో వందేళ్ళే ఉండలేనులే

హే కృష్ణ గోవింద హరే మురారి
హే కృష్ణ గోవింద హరే మురారి
హే కృష్ణ గోవింద హరే మురారి
హే కృష్ణ గోవింద హరే మురారి

Tag : lyrics

Relative Posts