DreamPirates > Lyrics > Nuvvante istam Lyrics

Nuvvante istam Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-23 15:16:58

Nuvvante istam Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chakri
Singer : Chakri
Composer : Chakri
Publish Date : 2023-08-23 15:16:58

Nuvvante istam Lyrics


Song Lyrics :

నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం (2)

ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా..

ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా

నువ్వంటేనే ఇష్టం నువ్వంటేనే ఇష్టం

నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం (2)

రంపంతోనే వద్దు నీ రూపంతో కోసెయ్యి

సుడిగుండంలో వద్దు నీ ఒడిలో నన్నే నిలువున ముంచెయ్యి

నిప్పులతోనే వద్దు కనుచూపులతో కాల్చేయ్యి

ఉరితాడసలే వద్దు నీ వాలుజడతోనే నా ఊపిరి తియ్యి

మందుపాతరే వద్దమ్మో ముద్దుపాతరే చాలమ్మో

తిరుగుబాటులే వద్దమ్మో అడుగు కింద నలిపేయమ్మో

ఇష్టం ఇష్టం ఐనా ఇష్టం

నువు నన్నే చంపు నాలో ప్రేమని కాదంటే కష్టం

నువ్వంటేనే ఇష్టం హే నువ్వంటేనే ఇష్టం

నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం

ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా..

పాతాళానికి వద్దు ఏ నరకానికి పంపొద్దు

నీ గుండెల గుహలో నన్ను తెగ హింసించెయ్యి అంతే చూసెయ్యి

కారాగారం వద్దు ఏ చెరసాలకి పంపొద్దు

నీ కౌగిలిలోనే నన్ను నువు బంధించెయ్యి నన్నంతం చెయ్యి

వేల సార్లు నే జన్మిస్తా వేల సార్లు నే మరణిస్తా..

ఒక్కసారి నువు ప్రేమిస్తే చావునయిన నే బ్రతికేస్తా..

ఇష్టం ఇష్టం ఇది నాకిష్టం..

ఏ కష్టాన్నైనా ఎదిరిస్తాను నువు కాదంటే కష్టం

నువ్వంటేనే ఇష్టం హే నువ్వంటేనే ఇష్టం

నువ్వంటేనే ఇష్టం నువు కాదంటేనే కష్టం

ఏం చేయమంటావో ఓ.. ఓ.. ప్రియతమా..

ఆకాశం నేలైనా ఈ నేలే నింగైనా ఆ రెండూ లేకున్నా.

Tag : lyrics

Relative Posts