Padamule Levu Pilla Song Telugu Lyrics Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Karunakar Adigarla |
Singer : | Armaan Malik, Harika Narayan |
Composer : | |
Publish Date : | 2023-01-02 00:00:00 |
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోనా
పలుకుగా మార్చి ప్రేమను కూర్చి
నీ పేరుగ నా పెదవితో పిలిచెయ్నా
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోనా
పలుకుగా మార్చి ప్రేమను కూర్చి
నీ పేరుగ నా పెదవితో పిలిచెయ్నా
(పిలిచెయ్నా పిలిచెయ్నా)
ఓ, నీ చూపే శీతాకాలం చలిమంటై
వెచ్చాగా తాకే ఎందుకంటావే
నీ నవ్వే మంచు పూల వానల్లే
తడిపేస్తుందే ఏమిటీవింతే
నా చిట్టిగుండె చుట్టూ ఉన్న
పిట్టగోడ దాటుకొచ్చి
తేనెటీగలాగా గుచ్చి
కుట్టి కుట్టి వెళ్లిపోయేనంట
అది ఎవరో తెలుసా..?
ఓ, చిన్ని చిన్ని రెక్కలొచ్చి
బోలెడన్ని ఊహలున్న నింగి లోకి
నన్ను పంపి ఎగరేసినదెవరంటా
ఈ అనుమానం… తీర్చేదేవరంటా..?
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోనా
పలుకుగా మార్చి ప్రేమను కూర్చి
నీ పేరుగ నా పెదవితో పిలిచెయ్నా
ఆపలేను, చెప్పలేను… మదిలోని మాట
దాచలేను, దాటలేను… మొహమాటం వల్ల
నా పెదాలపై ఓ పదం… ఒక నిశ్శబ్దమైపోయే
నా మౌనాలతో ఈ క్షణం… తెగ యుద్ధాలు జరిగేలా
ఏదో కల్లోలంలాగ ఉందే నాలోన
అయిన బాగుందే ఏమైనా
అరె నీకు నాలాగే ఉందా
చిత్రంగా ఉన్నా చంపేసే హాయనుకోనా
నీ గుండెలోన దాచుకుంటూ
గొంతు దాటి రాను అంటూ
గుట్టు గుట్టుగున్న వాడు
నేనుగాక ఇంకా ఎవరంటా
నువ్వు బయట పడవుగా
నీ కునుకునంత చెదరగొట్టి
కనుల పైన వాలుతున్న
కళలలోకి తేలుతున్న
కన్నె పిల్ల రూపం ఎవ్వారంటా..?
అది నేనేగా… నువ్ చెప్పావుగా
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోనా
పలుకుగా మార్చి ప్రేమను కూర్చి
నీ పేరుగ నా పెదవితో పిలిచెయ్నా
ఐ డోంట్ నో వాట్ హాపెండ్ టు మీ
ఆల్వేస్ హార్ట్ బీట్ ఫ్లైస్ ఇన్ ద స్కై
బికాస్ ఆఫ్ యు, ఐ గెస్ ఇస్న్’ట్ ఇట్ బేబీ..?
ఐ డోంట్ నో వై… ఐ ఆమ్ బికమింగ్ క్రేజీ
ఎవ్రీ సింగిల్ సెకండ్ థింకింగ్ ఆఫ్ యూ
యూ హావ్ డన్ సమ్థింగ్ టు మీ ఓ బేబీ
ఓ, నీ చూపే శీతాకాలం చలిమంటై
వెచ్చాగా తాకే ఎందుకంటావే
పదములే లేవు పిల్లా పిల్లా
అరువుగా తెచ్చుకోనా
పలుకుగా మార్చి ప్రేమను కూర్చి
నీ పేరుగ నా పెదవితో పిలిచెయ్నా
(పిలిచెయ్నా పిలిచెయ్నా)