DreamPirates > Lyrics > Padavoyi Bharateeyuda Song Lyrics - Velugu Needalu Lyrics

Padavoyi Bharateeyuda Song Lyrics - Velugu Needalu Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-09 00:00:00

Padavoyi Bharateeyuda Song Lyrics - Velugu Needalu Lyrics

Padavoyi Bharateeyuda Song Lyrics - Velugu Needalu Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Sri Sri
Singer : Ghantasaala, Madhavapeddi Satyam, P. Suseela, Venk
Composer : Pendyala Nageshwara
Publish Date : 2023-01-09 00:00:00

Song Lyrics :

Padavoyi Bharateeyuda Song Lyrics
పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా..ఆ..ఆ..
పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా..ఆ..ఆ..ఆ
పాడవోయి భారతీయుడా...

నేడే స్వాతంత్రదినం.. వీరుల త్యాగఫలం..
నేడే స్వాతంత్రదినం.. వీరుల త్యాగఫలం
నేడే నవోదయం... నీదే ఆనందం..

పాడవోయి భారతీయుడా.. ఆడిపాడవోయి విజయగీతికా..ఆ..ఆ..
పాడవోయి భారతీయుడా....

ఓ..ఓ..ఓ...స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి..
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి...
సాధించినదానికి సంతృప్తిని పొంది... అదే విజయమనుకుంటే పొరపాటోయి...

ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా..ఆ..ఆ..ఆ
ఆగకోయి భారతీయుడా.. కదిలి సాగవోయి ప్రగతిదారులా..ఆ..ఆ...
ఆగకోయి భారతీయుడా...

ఆకాశమందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ..
ఆకాశమందుకునే ధరలొకవైపు.. అదుపులేని నిరుద్యోగమింకొకవైపూ..
అవినీతి.. బంధుప్రీతి.. చీకటి బజారూ..
అలముకున్న నీ దేశమెటు దిగజారూ..

కాంచవోయి నేటి దిస్థితి..ఎదిరించవోయి ఈ పరీస్థితి..ఈ..ఈ..ఈ
కాంచవోయి నేటి దిస్థితి..ఎదిరించవోయి ఈ పరీస్థితి..ఈ..ఈ..ఈ
కాంచవోయి నేటి దిస్థితి...

పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ..
పదవీవ్యామోహాలూ కులమతభేదాలూ.. భాషాద్వేషాలూ చెలరేగే నేడూ..
ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే..
ప్రతిమినిషీ మరియొకని దోచుకునేవాడే.....తన సౌఖ్యం తన భాగ్యం చూచుకునేవాడే..

స్వార్థమే అనర్థకారణం..అది చంపుకొనుటే క్షేమదాయకం..
స్వార్థమే అనర్థకారణం..అది చంపుకొనుటే క్షేమదాయకం..
స్వార్థమే అనర్థకారణం...

సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం..నీ ధ్యేయం
సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం..నీ లక్ష్యం
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం...సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం..
సమసమాజనిర్మాణమే నీ ధ్యేయం...సకలజనుల సౌభాగ్యమే నీ లక్ష్యం..

ఏకదీక్షతో గమ్యం చేరిననాడే.. లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం..
లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం
లోకానికి మన భారతదేశం అందించునులే శుభసంకేతం

Tag : lyrics

Watch Youtube Video

Padavoyi Bharateeyuda Song Lyrics - Velugu Needalu Lyrics

Relative Posts