DreamPirates > Lyrics > పరిశుద్దుడవై మహిమప్రభావములకు..Pas.John Wesley New Worship song | christian song Lyrics

పరిశుద్దుడవై మహిమప్రభావములకు..Pas.John Wesley New Worship song | christian song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-12 16:11:16

పరిశుద్దుడవై మహిమప్రభావములకు..Pas.John Wesley New Worship song | christian song Lyrics

పరిశుద్దుడవై మహిమప్రభావములకు..Pas.John Wesley New Worship song | christian song Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Pas.John Wesley
Composer :
Publish Date : 2023-11-12 16:11:16

Song Lyrics :

మహిమ ప్రభావములు యేసయ్యకే

పల్లవి :

పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు

బలవంతుడవై - దీనుల పక్షమై కృపచూపువాడవు

దయాళుడవై ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా

ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా

సేవించెద నిన్నే నా పూర్ణహృదయముతో

|1 నీ స్వాస్థ్యమైన నీ వారితో కలసి నిను సేవించుటకు

నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి

శాశ్వతకాలమువరకు నీ సంతతిపై దృష్టినిలిపి

నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి.

ఆరాధన నీకే

2 నీ నిత్యమైన ఆదరణచూపి నను స్థిరపరచుటకు

నీ కరుణాకటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి

. నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి

నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి

ఆరాధన నీకే ॥

3 ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు

. నీ మహిమాత్మతో నింపి సురక్షితముగ నన్ను నివసింపజేసితివి

. మేఘవాహనుడవై వచ్చువరకు నే కనిపెట్టుచుందును నీకోసము

నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు

|| ఆరాధన నీకే

Tag : lyrics

Watch Youtube Video

పరిశుద్దుడవై మహిమప్రభావములకు..Pas.John Wesley New Worship song | christian song Lyrics

Relative Posts