Prana nadhuda Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Hermon Aradhana Keerthanalu |
Composer : | Hermon Aradhana Keer |
Publish Date : | 2023-10-10 18:41:40 |
ప్రాణనాథుడా యేసు త్యాగశీలుడా (2)
కలువరిలో నాకై బలియైన నా దేవా (2)
నాదేవా.... నా యేసయ్యా
1. రుజువైన నీప్రేమ నను వెదకి వచ్చినది
నిజమైన నీ ప్రేమ ప్రాణత్యాగం చేసినది.....(2)
రక్తమంత నాకై కార్చె రక్షణా భాగ్యము నిచ్చె...(2)
ఏమివ్వగలనయ్య విలువైన నీ ప్రేమకు..(2)
నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు సర్వేశ్వరా॥
కలువరిలో నాకై బలియైన నా దేవా (2)
నాదేవా.... నా యేసయ్యా(2)
2. పరిపూర్ణ సౌందర్యముగల సియోనులో నను చేర్చాలని
నిలువెల్ల నలిగెనయ్యా రూపునంత కోల్పోయావు(2)
నా దోషమంత భరించి మౌనివైనావయ్యా...(2)
ఏమివ్వగలనయ్య మితిలేని నీప్రేమకు...(2)
నా జీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు ప్రాణేశ్వరా॥
కలువరిలో నాకై బలియైన నా దేవా (2)
నాదేవా.... నా యేసయ్యా(2)
3. సురూపమైనను సొగసైనను లేదయ్యం
మనుష్యులు చూడనొల్లని వానిగా నీవు మారావయ్య....(2)
వధకు తేబడినావయ్యా మౌనిమైన గొర్రెపిల్లగా...(2)
ఏమివ్వగలనయ్య పూర్ణమైన నీప్రేమకు..(2)
నాజీవితమంత ఇచ్చిన సరిపోదు యేసయ్యా ||సరిపోదు పరిశుద్ధుడా||
కలువరిలో నాకై బలియైన నా దేవా (2)
నాదేవా.... నా యేసయ్యా(2)