DreamPirates > Lyrics > Prema purnuda vishwanaadhuda Hosanna ministries 2024 Lyrics

Prema purnuda vishwanaadhuda Hosanna ministries 2024 Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-01-19 12:11:10

Prema purnuda vishwanaadhuda Hosanna ministries 2024 Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Hosanna ministries
Singer : Johnwesly-Abraham-Ramesh
Composer : Hosanna ministries 2
Publish Date : 2024-01-19 12:11:10

Prema purnuda  vishwanaadhuda Hosanna ministries 2024 Lyrics


Song Lyrics :

ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా విశ్వనాధుడా- విజయవీరుడా ఆపత్కాలమందున - సర్వలోకమందున్న దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా

ఆనందింతు నీలో-జీవితాంతము నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య

చరణం1:

పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు ఇన్నాళ్లు క్షణమైనా ననుమరువని యేసయ్య

నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా

చరణం 2:

భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య

నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా

చరణం 3:

నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య

నా తోడు నీవుంటే అంతే చాలయ్య నాముందు నీవుంటే భయమే లేదయ్యా!

Tag : lyrics

Relative Posts