DreamPirates > Lyrics > Prema Yatralaku Song Lyrics | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna Lyrics

Prema Yatralaku Song Lyrics | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-20 00:00:00

Prema Yatralaku Song Lyrics | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pingali Nageswara Ra
Singer : Ghantasala, P. Suseela
Composer : Ghantasala
Publish Date : 2022-09-20 00:00:00

Prema Yatralaku Song Lyrics | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna Lyrics


Song Lyrics :

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో ..
కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏ లనో

ఆహాహా హాహాహా హా ....


కులుకులొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏలనో
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏ లనో


తీర్థయాత్రలకు రామేశ్వరము
కాశి ప్రయాగలేలనో
ప్రేమించిన పతి యెదుటనుండగా
వేరే దైవము ఏలనో

ఆహాహా ఆహాహా హా ....


ప్రేమించిన పతి యెదుటనుండగా
వేరే దైవము ఏలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము
కాశి ప్రయాగలేలనో


1. చెలి నగుమోమె చంద్రబింబమై
పగలే వెన్నెల కాయగా

అహహా ఆహా

అహహా

అహహా హా ....

చెలి నగుమోమె చంద్రబింబమై
పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతో
జగమునే ఊటీ సాయగా

అహహా అహహా హా

సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీ సాయగా

ప్రేమయాత్రలకు కొడైకెనాలు
కాశ్మీరాలు ఏలనో

2. కన్నవారినే మరువజేయుచు
అన్ని ముచ్చటలు తీర్చగా

అహహా ఆహా

అహహా

అహహా హా ....

కన్నవారినే మరువజేయుచు
అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని
సర్వశాస్త్రములు చాటగా

అహహా అహహ్హహ్హ .....

పతి ఆదరణే సతికి మోక్షమని
సర్వశాస్త్రములు చాటగా
తీర్ధ యాత్రలకు కైలాసాలూ
వైఖుంఠాలు ఏలనో

అన్యోన్యముగా దంపతులుంటే
భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనము
నందనవనము ఏలనో ...

Tag : lyrics

Relative Posts