Priyatama Lyrics | Prema| Balu | Ilayaraja | Atreya Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Acharya Atreya |
Singer : | S P Balasubramanyam |
Composer : | Ilayaraja |
Publish Date : | 2022-12-30 00:00:00 |
ప్రియతమా .. నా హృదయమా Priyatama Na Hrudayama
ప్రియతమా .. నా హృదయమా& Priyatama Na Hrudayama
ప్రేమకే ప్రతిరూపమా Premake Prathi Roopama
ప్రేమకే ప్రతిరూపమా Premake Prathi Roopama
నా గుండెలో నిండిన గానమా .. Na Gundelo Nindina Ganama...
నను మనిషిగా చేసిన త్యాగమా... Nanu Manishiga Chesina Tyagama..

ప్రియతమా .. నా హృదయమా Priyatama Na Hrudayama
ప్రేమకే ప్రతిరూపమా Premake Prathi Roopama

శిలలాంటి నాకు జీవాన్ని పోసి .. Silanti Naku Jeevanni Posi...
కలలాంటి బ్రతుకు కళతోటి నింపి Kalalanti Bratuku Kalathoti Nimpi
వలపన్న తీపి తొలిసారి చూపి .. Valapanna Thipi Tholisari Choopi
ఎదలోని సెగలు అడుగంట మాపి Edaloni Segalu Aduganta Mapi
నులివెచ్చనైన ఓదార్పు నీవై .. Nuli Vechchanaina Odarpu Nivai
శృతిలయ లాగ జతచేరినావు Sruthilayalaga Jatha Cherinavu
నువు లేని నన్ను ఊహించలేనూ .. Nuvu Leni Nannu Oohinchalenu..
నావేదనంతా నివేదించలేను Na Vedanantha Nivedinchalenu
అమరం అఖిలం మన ప్రేమా... Amaram Akhilam Mana Prema..

ప్రియతమా .. నా హృదయమా Priyatama Na Hrudayama
ప్రేమకే ప్రతిరూపమా Premake Prathi Roopama

లలాలలా....లలాలలా....లలాల లాలలా... Lalala... Lalala... Lalala Lalala
లలాల లాలలా... లల లల లల లాలలా... Lalal... Lalala... Lala Lala Lalala...

నీ పెదవి పైనా వెలుగారనీకు .. Ni Pedavipaina Velugaraniku
నీ కనులలోన తడి చేరనీకు Ni Kanulalona Tadi Cheraniku
నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు .. Ni Kanniti Chukke Munniru Naku
అది వెల్లువల్లే నను ముంచనీకు Adi Velluvalle Nanu Munchaniku
ఏ కారుమబ్బు ఎటు కమ్ముకున్నా .. Ee Karumabbu Etu Kammukunna
మహా సాగరాలే నిను మింగుతున్నా Maha Sagarale Ninu Minguthunna
ఈ జన్మలోనా ఎడబాటు లేదు.. Ie Janmalona Edabatu Ledu
పది జన్మలైన ముడే వీడిపోదు Padi Janmalaina Ode Veedipodu
అమరం అఖిలం మన ప్రేమా... Amaram Akhilam Mana Prema....

ప్రియతమా .. నా హృదయమా Priyatama Na Hrudayama
ప్రియతమా .. నా హృదయమా& Priyatama Na Hrudayama
ప్రేమకే ప్రతిరూపమా Premake Prathi Roopama
ప్రేమకే ప్రతిరూపమా Premake Prathi Roopama
నా గుండెలో నిండిన గానమా .. Na Gundelo Nindina Ganama...
నను మనిషిగా చేసిన త్యాగమా... Nanu Manishiga Chesina Tyagama..

ప్రియతమా .. నా హృదయమా Priyatama Na Hrudayama
ప్రేమకే ప్రతిరూ......పమా Premake Prathi Roo.....pama