DreamPirates > Lyrics > Rama Rama Raghurama Telugu Song | Sri Anjaneyam Movie Lyrics

Rama Rama Raghurama Telugu Song | Sri Anjaneyam Movie Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-09 13:59:49

Rama Rama Raghurama Telugu Song | Sri Anjaneyam Movie Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sirivennela Seethara
Singer : Mallikarjun
Composer : Sirivennela Seethara
Publish Date : 2023-07-09 13:59:49

Rama Rama Raghurama Telugu Song  | Sri Anjaneyam Movie  Lyrics


Song Lyrics :

Rama Rama Raghurama Telugu Song Lyrics

రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా… అచ్చం నీలాగ
నిత్యం నీతో ఉన్నాగా… ఇద్దరి లక్షణమొకటేగా
ఆఆఆ ఆఆఆ ఆఆ… ఓఓ ఓఓ ఓ
రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా

అమ్మల్లే నను పెంచింది… ఈ పల్లెసీమ
నాన్నల్లే నడిపించింది… ఊరంత ప్రేమ
అమ్మల్లే నను పెంచింది… ఈ పల్లెసీమ
నాన్నల్లే నడిపించింది… ఊరంత ప్రేమ
ఎలా పెంచుకున్నా… ఎలా పిలుచుకున్నా
ఈ మట్టి సొంతం… నా చిట్టి జన్మం
అన్నీ సొంత ఇల్లే… అంతా అయినవాళ్ళే
ఈ స్నేహ బంధం… నా పూర్వ పుణ్యం
బ్రతుకంతా ఇది తీరే ఋణమా… ఆ ఆ ఆఆ

రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా

ఏ ఆటలాడిస్తావో… ఓ కోతి బొమ్మ
ఏ బాట చూపిస్తావో… కానున్న బ్రహ్మ
ప్రసన్నాంజనేయం… అనే నామధేయం
ప్రతి మంచి కార్యం… జరిపించు దైవం
ప్రభాదివ్యకాయం… ప్రకీర్తి ప్రదాయం
నాలోని ధైర్యం… శ్రీ ఆంజనేయం
నా వెంటే నువ్వుంటే భయమా… ఆ ఆ ఆఆ

రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా
అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా
సరదాగా నా గాలి పాట వినుమా
విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా
గాలికి పుట్టా గాలికి పెరిగా… అచ్చం నీలాగ
నిత్యం నీతో ఉన్నాగా… ఇద్దరి లక్షణమొకటేగా
ఆఆఆ ఆఆఆ ఆఆ… ఓఓ ఓఓ ఓ

Tag : lyrics

Relative Posts