Rammanu Chunnadu Ninnu Prabhu Yesu Song Telugu By D.G.S Dhinakaran | christian worship song Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | D.G.S Dhinakaran |
Composer : | |
Publish Date : | 2023-11-12 16:16:34 |
పల్లవి: రమ్మనుచున్నాడు నిన్ను ప్రభుయేసు
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.
1. ఎటువంటి శ్రమలందును - ఆదరణ నీ కిత్తునని
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దులేని యింపు పొందెదవు
2. కన్నీరంత తుడుచును కనుపాప వలె కాపాడున్
కారు మేఘము వలె కష్టములు వచ్చినను
కనికరించి నిన్ను కాపాడును
3. సొమ్మసిల్లు వేళలో - బలమును నీకిచ్చును
ఆయన నీ వెలుగు రక్షణయై నందున
ఆలసింపక నీవు త్వరపడి రమ్ము
॥రమ్మను॥
4. సకల వ్యాధులను - స్వస్థపరచుటకు
శక్తిమంతుడగు ప్రభుయేసు ప్రేమతో
అందరికి తన కృపల నిచ్చును
॥రమ్మను॥