RAYE RAYE RAMULA FULL SONG | LOVE FAILURE SONG Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Subhash Subbu |
Singer : | Hanumanth Yadav & Vaishali Prabhakar |
Composer : | Subhash Subbu |
Publish Date : | 2023-10-30 16:48:49 |
ఓ, సిటికెడంత ప్రేమనే కోరుకున్న
నీ సెయ్యి పట్టాలని
నీ సిరునవ్వు సూడాలని
నువ్వు పోయేటి తొవ్వల్ల
నీడల్లే ఉంటు భద్రంగ జూడాలని
ఏ బాధ నీకు తేననీ
దండాలే ఎట్టుకున్న
నా దరి నువ్వే ఈడొద్దనీ
తీరొక్క పూజలు జేసా
జన్మంతా నీతోననీ
ఘల్లునా మోగేటి గాజులు
నీ చెయ్యికి ఎయ్యాలని
పసుపంతా రాసిన తాడును
నీ మెళ్ళో గట్టాలనీ
ఆలివైతవనుకున్ననే
అరచేతిల దీపంలా నిన్ను మోసానే
రాములా, ఆ ఆ
నువ్ రాయే రాయే రాములా
నా సేతిలోని సిన్ని గీతల్ల
నువ్ రాయే రాయే రాములా
కలిసి బతుకుదాము ఈ నేలన
నువ్ రాయే రాయే రాములా
నా సేతిలోని సిన్ని గీతల్ల
నువ్ రాయే రాయే రాములా
కలిసి బతుకుదాము ఈ నేలన
నువ్ అడుగు వేసే పాదాల
కింద నలుపల్లె తాకే మట్టిలా
నీ నుదుటిపై మెరిసే బొట్టులా
ఎదురుచూపే నీ కొరకు ఆశలా
(ఎదురుచూపే నీ కొరకు ఆశలా)
నా ముద్దుల సిరివే రాముల
ఎర్ర ఎర్రంగ మండే కొలిమిలా
ఎదపైనే ముద్రించ బొమ్మలా
కలిసి బతుకుదాము ఈ నేలన
(కలిసి బతుకుదాము ఈ నేలన)
ఆ రాత రాసినోడే
నిన్ను నాకివ్వలేదే
ఎడబాటు ఇంకెందుకే
ప్రేమ బంధాన్ని బతికియ్యవే
పురిటినొప్పుల తల్లి ప్రేమను పంచే
కట్టుకునె పిల్ల కన్నీళ్ళగచ్ఛే
రాములా, ఆ ఆ
నువ్ రాయే రాయే రాములా
నా సేతిలోని సిన్ని గీతల్ల
నువ్ రాయే రాయే రాములా
కలిసి బతుకుదాము ఈ నేలన
నువ్ రాయే రాయే రాములా
నా సేతిలోని సిన్ని గీతల్ల
నువ్ రాయే రాయే రాములా
కలిసి బతుకుదాము ఈ నేలనా
ఆ పొంగేటి గోదారమ్మలా
నాపైనే కురిసే వరదలా
మునిగిపోయాను నిలువున నీలోన
పైకి తేవా ప్రేమను పంచవా
పైకి తేవా ప్రేమను పంచవా
ఎంత సక్కని పేరే రాములా
సూడ సక్కని జంటై ఊరూరా
కాన రాదే కంటి అంచుల్ల
కలిసి ఉంటా కాళ్లకు మట్టెల్లా
నీ బతుకు కోరినోన్నే
నీకు బానిసనయ్యానే
తిరుగు బాధలు మోస్తూనే
ఎంతొ ప్రేమను పంచానే
రాములా, ఆ ఆ
నువ్వు రాయే రాయే రాములా
నా సేతిలోని సిన్ని గీతల్ల
నువ్వు రాయే రాయే రాములా
కలిసి బతుకుదాము ఈ నేలన
నువ్వు రాయే రాయే రాములా
నా సేతిలోని సిన్ని గీతల్ల
నువ్వు రాయే రాయే రాములా
కలిసి బతుకుదాము ఈ నేలనా