DreamPirates > Lyrics > Regumullole-chandamaama- Lyrics

Regumullole-chandamaama- Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-02 00:00:00

Regumullole-chandamaama- Lyrics

Regumullole-chandamaama- Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Suddala ashok teja
Singer : Karthik, srilekha
Composer : Km Radha krishnan
Publish Date : 2023-01-02 00:00:00


Song Lyrics :

రేగుముల్లోలే నాటు సిన్నాది
బొడ్డు మల్లెలు సూడు అన్నాది
మీసాలు గుచ్చకుండా ఆఁహాఁ
ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లె ముట్టుకుంటాను
కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా
ఒరేయ్ బావో కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా
అది కదులుతుంటే వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బా
ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండా...

Come on Come on Come on Baby
Shake your body baby
Come on Come on Come on Baby
Make me rock
Come on Come on Come on Baby
Save the song baby
Come on Come on Come on Baby
Make you rock

కోనేటి నీళ్ళల్లో ఆ ఆ వంగిందిరో ఆ ఆ
కుండల్లే నా గుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్ట గోడెక్కి నుంచుందిరో
కొమ్మొంచి కాయేదో తెంపిందిరో అచ్చా
అది జాంపండులా నను తింటుందిరో
ఎదురే పడితే ఎదలో
గుండు సూదల్లె దిగుతావురో
తన కనులు గిలికి సింగారి ఛా!
తన జడను విసిరి వయ్యారి
చిరు నగవు చిలికి ఒకసారి
కొస పెదవి కొరికి ప్రతిసారి యహ
యహ మీసాలు గుచ్చకుండా
ఒరేయ్ బావో ముద్దడతావా నువ్వు

మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళరా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ వస్తివా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళరా
మళ్ళ మళ్ళ మళ్ళ మళ్ళ వస్తివా

ఆ జొన్న చేలల్లో పక్కందిరో
ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోనే సై అంటేరో
దాసోహమౌతాను నూరెళ్ళురో
ఇక తన కాళ్ళకే పసుపవుతానురో
ఇదిగో పిల్లడో నువ్వు గుండెల్లో
ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతై
పై జనమలోన ఇక పుడతా
అని చెలిమి చేరి మొర పెడితే
తెగ కులుకులొలికి ఆ సిలక
మీసాలు గుచ్చకుండా ఒసేయ్ భామ
ముద్దాడలేనే నేను

కంది పూవల్లె ముట్టుకుంటాను
అహ కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా ఒరేయ్ బావో
కౌగిళ్ళు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో
ముద్దాడుతావా అంది
???

Tag : lyrics

Watch Youtube Video

Regumullole-chandamaama- Lyrics

Relative Posts