Sirimalle Puvva Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Jandhyala |
Singer : | Janaki |
Composer : | K. Chakravarthy |
Publish Date : | 2022-11-22 00:00:00 |
సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నాతోడూ ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
''సిరిమల్లె పువ్వా''
చరణం :
తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్లారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడ నా చందమామ రాడే
చుక్కల్లారా దిక్కులు దాటి వాడేన్నాళ్ళ కొస్తాడో
''సిరిమల్లె పువ్వా''
కొండల్లో కోనల్లో కూ యన్న ఓ కోయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే
చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో...
''సిరిమల్లె పువ్వా''