DreamPirates > Lyrics > Software dreams Lyrics

Software dreams Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-09-17 13:02:47

Software dreams Lyrics

Software dreams  Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Keshv
Singer : Sumn
Composer : Akula
Publish Date : 2023-09-17 13:02:47


Song Lyrics :

మన రాష్ట్రంలో విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మీద మోజు. సంపాదన మీద ఆలోచన ఉండటం మంచిదే. అయితే చదువంటే ఇంజనీరింగ్ ఒక్కటేనా? 'ఇంజనీర్ అవ్వాలి. అమెరికా పోవాలి' ఇదే ధ్యాస కనపడుతోంది.

ఈ మధ్య CA కూడా తయారయింది.

మన తెలుగు రాష్ట్రాలనుండి సివిల్స్ కు వెళ్ళేవారి సంఖ్య, అందులో నెగ్గుకొచ్చేవారి సంఖ్య, బీహార్, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. మనకు వచ్చే ఐఏయస్, ఐపియస్ అధికారులలో త్రిపాఠీలు, మిశ్రాలు, మీనాలు ఎక్కువ.

దీనికి కారణం ముఖ్యంగా ప్రైవేటు కళాశాలల మార్కెటింగ్. గుంటూరులో చూస్తుంటాను, దాదాపు 75,000 నుండి 80,000 మంది CA కోచింగ్ కోసం వస్తూ ఉంటారు. జాతీయ స్థాయిలోనే పాస్ పర్సంటేజ్ 2%. CA కోర్సు పూర్తి చేసి, సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకుని నిలదొక్కుకునే సరికి 30-35 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. ఐతే అందులోకి వెళ్ళవద్దని చెప్పడం లేదు.

నా ఘోషంతా మనవాళ్ళు సివిల్స్ లోకి ఎందుకు వెళ్ళరు? అనేది.

సివిల్స్ అనగానే మనకు కనపడేవి రెండే. ఐఏయస్, ఐపియస్.

నేను ఎవరికైనా సివిల్స్ చెయ్యమని చెబితే 'అమ్మో, చాలా కష్టం' అనే మాట వినపడుతుంది.

CA కష్టం కాదా? ఇంజనీరింగ్ కష్టం కాదా? మెడిసిన్ కష్టం కాదా? 'లా' కష్టం కాదా?

ఇష్టంగా చదివితే కష్టమైనా ఇష్టమవుతుంది. సివిల్స్ గురించి, 'లా' గురించి సరైన అవగాహన లేకపోవడం అసలు కారణం అనిపిస్తుంది.

'లా' గురించి మరొకసారి చెప్పుకుందాం. సివిల్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయనేది చూద్దాం.

సివిల్స్ లో మొత్తం 24 సర్వీసులు ఉన్నాయి.

వీటిలో మూడు ఆల్ ఇండియా సర్వీసెస్.

01. Indian Administrative Service (IAS)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలను అమలు చేసే బాధ్యత వీరిదే. అత్యంత ప్రతిష్టాత్మకమైన, బాధ్యతగల ఉద్యోగం. రాష్ట్రంలో ఛీఫ్ సెక్రటరీ, కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ వరకు ఎదిగే అవకాశం ఉంటుంది.

02. Indian Police Service (IPS)

జిల్లా ఎస్పీ స్థాయినుండి CBI, IB, CRPF, BSF, CISF, RAF వంటి వాటికి డైరక్టర్, డైరక్టర్ జనరల్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది.

03. Indian Forest Service (IFS)

రాష్ట్రంలోను, కేంద్రంలోను ఛీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ స్థాయి దాకా వెళ్ళే అవకాశం ఉన్నది.

గ్రూప్ A సివిల్ సర్వీసెస్ ....

01. Indian Foreign Service (IFS)

వివిధ దేశాలలో హై కమీషనర్, ఛార్జ్ డీ అఫైర్స్, రాయబారులు, ఐక్యరాజ్యసమితి, కేంద్రంలో విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి స్థాయికి చేరుకోగలరు.

02. Indian Audit and Accounts Service (IAAS)

వివిధ ప్రభుత్వ శాఖల, సంస్థలను ఆడిట్ చేసేందుకు నియోగించబడతారు. వీళ్ళు కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ (CAG) క్రింద పని చేస్తారు.

03. Indian Civil Accounts Service (ICAS)

వీళ్ళు కూడా పైన చెప్పిన పనులే చేస్తారు. కానీ రాష్ట్ర స్థాయిలో ఎకౌంటెంట్ జనరల్ క్రింద పని చేస్తారు.

04. Indian Corporate Law Service (ICLS)

కేంద్ర కార్పొరేట్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన లీగల్ విషయాలు చూస్తారు.

05. Indian Defence Accounts Service (IDAS)

రక్షణరంగంయొక్క ఎకౌంట్స్ తనిఖీ చేస్తారు,

06. Indian Defence Estates Service (IDES)

కంటోన్మెంట్స్, ఎయిర్ ఫోర్స్, నేవీలకు చెందిన భూములు, భవనాల నిర్వహణ.

07. Indian Information Service (IIS)

కేంద్ర సమాచార శాఖకు చెందినది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఆలిండియా రేడియో, దూర్ దర్శన్ లలో పని చేస్తారు.

08. Indian Ordinance Factories Services (IOFS)

ఆయుధ తయారీ పరిశ్రమలలో పని చేస్తారు. రక్షణశాఖకు చెందినది.

09. Indian Communication Finance Service (ICFS)

టెలీకామ్ రంగానికి చెందిన ఆర్థిక వ్యవహారాలు చూస్తారు.

10. Indian Postal Service (IPoS)

పోస్ట్ & టెలిగ్రాఫ్ శాఖకు చెందినది. పోస్ట్ మాస్టర్ జనరల్ స్థాయికి చేరగలరు.

11. Indian Railway Accounts Service (IRAS)

రైల్వేల ఆదాయ, వ్యయాలను పర్యవేక్షించేది.

12. Indian Railway Personnel Service (IRPS)

రైల్వే ఉద్యోగుల నియామకంనుండి పదవీ విరమణ వరకు వీరి ఆధ్వర్యంలోనే నడుస్తుంది.

13. Indian Railway Traffic Service (IRTS)

దేశంలో రైళ్ళ నిర్వహణ బాధ్యత.

14. Indian Revenue Service (IRS)

లిస్టులో వెనుక ఉందని తక్కువ అంచనా వేయకండి. ఇన్కమ్ టాక్స్, కస్టమ్స్ & ఎక్సైజ్ శాఖలో ఆఫీసర్ స్థాయినుండి ఛీఫ్ కమీషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్, Central Bureau of Direct Taxes (CBDT), Central Board of Indirect Taxes (CBIT), GST Council వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. ఈ మధ్య మనం తరచుగా వింటున్న 'ఈడి' (Enforcement Directorate) ఈ కేడర్ నుండే వస్తారు.

15. Indian Trade Service (ITS)

వాణిజ్యశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. DGFT (Director General of Foreign Trade) స్థాయివరకు వెళ్ళేందుకు అవకాశం ఉంది.

16. Railway Protection Service (RPF)

రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యత. రైల్వేల ఆధీనంలో పని చేస్తుంది.

గ్రూప్ B సర్వీసెస్ ....

01. Armed Forces HQ Civil Service

త్రివిధ దళాల, పారా మిలిటరీ కేంద్ర కార్యాలయాలలో Non Combating సర్వీస్.

02. DANICS (Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Civil Services)

ఆయా కేంద్ర పాలిత ప్రాంతాలలో IAS వంటిది.

03. DANIPS (Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Police Service)

ఆయా కేంద్రపాలిత ప్రాంతాలలో IPS వంటిది.

04. Pondicherry Civil Services

పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో IAS వంటిది.

05. Pondicherry Police Service

పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో IPS వంటిది.

మొత్తం 24 సర్వీసులు ఉన్నాయి.

ఇవికాక Indian Economic Service, Indian Military Engineering Service, Indian Statistical Service, Military Medical Service, Armed Forces Nursing Service ....

ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిల్లోకి వెళ్తే జీతం, పెన్షన్ భద్రత, ప్రభుత్వ మెడికల్ సదుపాయాలు వగైరాలు ఉంటాయి.

ఈ సర్వీసెస్ లోకి వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.

పిల్లలకు స్కూల్ దశనుండే వారి అభిరుచులకు అనుగణంగా చదివించడం ఉత్తమం. కానీ చాలామంది పిల్లలు పెద్ద పెద్ద భవనాలు చూసి సాఫ్ట్ వేర్ ఉద్యోగం అంటే మోజు పడతారు. వాళ్ళకు అందులో ఉండే ఇబ్బందులు వివరించండి. (కొన్నిచోట్ల తుమ్మితే ఊడే ముక్కు).

సరైన అవగాహన కల్పిస్తే మన పిల్లలు కూడా ఆలిండియా సర్వీసెస్ లో రాణిస్తారు.

(లీగల్ ప్రొఫెషన్ లో ఉండే అవకాశాలు మరొకసారి చూద్దాం).

పంచుకోదలచినవారు నిరభ్యంతరంగా పంచుకోవచ్చు.

Tag : lyrics

Watch Youtube Video

Software dreams  Lyrics

Relative Posts