DreamPirates > Lyrics > Sri Satyanarayana Song In Telugu Lyrics

Sri Satyanarayana Song In Telugu Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-20 11:29:16

Sri Satyanarayana Song In Telugu Lyrics

Sri Satyanarayana Song  In Telugu Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : -
Singer : -
Composer : -
Publish Date : 2023-10-20 11:29:16


Song Lyrics :

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ ||2||

నోచిన వారికి… నోచిన వరము
చూసిన వారికి… చూసిన ఫలము
శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

స్వామిని పూజించే… చేతులే చేతులట
ఆ మూర్తిని దర్శించే… కనులే కన్నులట
తన కథ వింటే ఎవ్వరికయినా… జన్మ తరించునటా

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

ఏ వేళ అయినా… ఏ శుభమైనా
కొలిచే దైవం… ఈ దైవం
అన్నవరంలో వెలసిన దైవం… ప్రతి ఇంటికి దైవం

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

అర్చణ చేదామా… మనసు అర్పణ చేదామా
స్వామికి మదిలోనే… కోవెల కడదామా
పది కాలాలు పసుపు కుంకుమలు… ఇమ్మని కొరేమా

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

మంగళమనరమ్మా… జయ మంగళమనరమ్మా
కరములు జోడించి… శ్రీచందనమలరించి
మంగళమనరే… సుందర మూర్తికి
వందనమనరమ్మా…

శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

నోచిన వారికి… నోచిన వరము
చూసిన వారికి… చూసిన ఫలము
శ్రీ సత్యనారాయణుని… సేవకు రారమ్మ
మనసారా స్వామిని కొలిచి… హారతులీరమ్మ

Tag : lyrics

Watch Youtube Video

Sri Satyanarayana Song  In Telugu Lyrics

Relative Posts