DreamPirates > Lyrics > SUDHOORAMU Lyrics

SUDHOORAMU Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-04-23 07:37:12

SUDHOORAMU Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Joel Kodali
Singer : Surya Prakash Injarapu
Composer : Hadlee Xavier
Publish Date : 2023-04-23 07:37:12

SUDHOORAMU Lyrics


Song Lyrics :

సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము

యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా

నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి

సుమధుర భాగ్యము యేసుతో పయనము

1. అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా

ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా

ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు

ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము

ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం

2. హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా

ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు

నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును

ఇది నా భాగ్యము నాలోని ధైర్యము

ఏ దిగులు లేకనే నే సాగిపోదును

3. నా జీవితం పదిలము యేసుని చేతిలో

నా పయనము సఫలము యేసుదే భారము

నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము

ఇది నా విశ్వాసము నాకున్న అభయము

కృపగల దేవుడు విడువడు ఎన్నడూ

Tag : lyrics

Watch Youtube Video

SUDHOORAMU Lyrics

Relative Posts