The Hymn Of Dharma - Lyrics In Telugu Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Battu Vijay Kumar |
Singer : | KS Harisankar |
Composer : | Nobin Paul Garu |
Publish Date : | 2022-12-29 00:00:00 |
రెహమ్ మేరె ఖుదా
రెహమ్ మేరె ఖుదా
రెహమ్ మేరె ఖుదా
బ్రతకమంటూ బ్రతుకునిచ్చి
బ్రతకనివ్వవు వివరమేంటయ్యా
ఎవరు అడిగే నిన్ను ప్రాణం
ఎందుకిచ్చావ్ జీవి జన్మం
ఘోరమైన విధిని రాసే
క్రూరమైన మనసు నీదయ్యా
తీపి చూపి చేదునిస్తూ
బంధమిచ్చి బాధనిస్తూ
తెగే..! తెగేనని తెలిసి
మనసుల ముడులు వేస్తావా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా టెన్ టు ఫైవ్ ఓ ఓ ఓ
చూడు కథలో మలుపే
తీసే మరణపు తలుపే
కాలమే రాసిన విద్రోహ విష కథనం
నిన్న నవ్విన నవ్వుల వెనక
ఇంత దుఃఖముందా నయవంచకా
కంటిరెప్పంచునా ఏడు సంద్రాలనే
ఉంచి పొంగించొద్దు ఆపెయ్ ఈ ఆటనే
ఎందుకీ శోఖము, అసలెందుకీ శాపము
ప్రాణాలతో చెలగాటము, చూపిక జాలి గుణము
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా టెన్ టు ఫైవ్ ఓ ఓ ఓ
వాన చినుకే పడెనే
దాచి పిడుగుల జడినే
తొలకరే ప్రళయమై
కావలించినది అరెరే
వేడుకుంటున్నా వినవా వ్యధనే
మార్చి రాసేయవా తలరాతనే
నా ఆయుష్షులో సగం తీసేసుకో
ఏదో వరమిచ్చి ప్రాణాన్నే కాచుకో
ఇవ్వడం ఎందుకు
లాక్కోవడం ఎందుకు
నిస్వార్ధపు స్నేహాలకు
ఈ శిక్షే ఎందుకొరకు
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
కనవా కనవా ఒక ప్రాణ బంధపు వేదనా
వినవా వినవా ఒక మూగ గొంతుక ప్రార్థన
వినవా కనవా ఓ..!