యెహోవాయే నా నిజదేవుడు || TPM 2023 VIJAYAWADA CONVENTION SONGS || Yehovaye Na Nija Devudu || Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | TPM church |
Singer : | TPM church |
Composer : | |
Publish Date : | 2023-11-09 13:38:08 |
పల్లవి యెహోవాయే నా నిజదేవుడు.
ఎల్లప్పుడూ నేను కొనియాడెదన్
స్తుతికి యోగ్యుడు నా ప్రియయేసు
స్తోత్రగీతంతో స్తుతించెదను
1.సర్వాధికారి నా యెహోవా - సర్వశక్తితో ఏలును సమస్తం
సర్వాధికారము పొందిన యేసు - సర్వదా నాతోయుండి జయమిచ్చె
2. చూచుచున్న దేవా నా యెహోవా - చెక్కితివి నన్ను నీ అరచేతిలో
కునుకక నిద్రపోక నాయేసు - కనుపాపవలె నను కాపాడెను
3. గొప్ప దేవుడు నా యెహోవా - గొప్ప కార్యముల్ చేసెను నాకై
అద్భుత స్వస్థత యిచ్చెను యేసు - ఆశ్చర్యముగ నన్ను నడిపించెను
4. దహించు అగ్ని నా యెహోవా - దహించి వేసెను శత్రుశక్తులను
అగ్ని అభిషేకంతో నింపెను యేసు - అగ్ని శోధనలో జయమిచ్చెను
5. స్తుతిఘన మహిమ నీకే తండ్రీ! - స్తోత్ర జిహ్వాఫలం అర్పించెదను
అంతము వరకు కాపాడు యేసు - ఆ సీయోన్ షాలేములో చేర్చు నన్ను